గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 2 మార్చి 2015 (20:53 IST)

వద్దన్నా ఓరల్ సెక్స్ చేశాడు... ఆరోగ్యానికి హాని కలుగుతుందా...?

అతడిని గాఢంగా ప్రేమించాను. పెళ్లి కూడా అతడినే చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇటీవల సెక్స్ కావాలని చాలా ఒత్తిడి చేశాడు. కానీ అతడికి ఎయిడ్స్ పరీక్ష చేసిన తర్వాతే అందులో పాల్గొనాలని నేను గట్టిగా అనుకున్నాను. ఐతే అతడు ఉండలేకపోయాడు. కనీసం ఓరల్ సెక్స్‌కు ఒప్పుకోమని గొడవ చేయడంతో ఓకే అన్నాను. ఐతే ఇప్పుడు భయం పట్టుకుంది. అదేమిటంటే, ఓరల్ సెక్సులో పాల్గొన్నా ఎయిడ్స్ వస్తుందంటున్నారు. ఇది నిజమేనా...?

 
ఎయిడ్స్ వ్యాధి కేవలం యోని ద్వారా సెక్సులో పాల్గొంటేనే కాదు... ఇతర పద్ధతుల్లో పాల్గొన్నా వచ్చే అవకాశం లేకపోలేదు. ఓరల్ సెక్సు వల్ల ఒకవేళ వ్యక్తికి ఎయిడ్స్ వ్యాధి ఉంటే అది సంక్రమించే అవకాశం చాలా తక్కువగా ఉన్నప్పటికీ రాదని మాత్రం చెప్పలేం. అందువల్ల అపరిచిత వ్యక్తులతో సెక్సులో పాల్గొనేటపుడు ఖచ్చితంగా కండోమ్ వాడి తీరాల్సిందే. ఓరల్ సెక్సుపై కూడా నియంత్రణ చేసుకోవడం మంచిది.