గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2015 (17:13 IST)

భావప్రాప్తి అంటే ఏంటో తెలియదు.. కానీ తల్లినయ్యా.. నాలో సెక్స్ స్పందనలు లేనట్టా?

శృంగార జీవితంలో అంతిమఘట్టం భావప్రాప్తి. సెక్స్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరూ భావప్రాప్తికి లోనవుతుంటారని వింటాను. కానీ, నాకు వివాహమై పదేళ్లు అయింది. ఇద్దరు పిల్లలకు తల్లినయ్యా. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కసారి కూడా భావప్రాప్తికి లోనుకాలేదు. అసలు భావప్రాప్తి అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఇదేవిషయం నా భర్త వద్ద కూడా పలుమార్లు ప్రస్తావించా. నాలో సెక్స్ కోర్కెలు లేవనీ అందుకే భావప్రాప్తి పొందలేక పోతున్నావని చెపుతున్నారు. భావప్రాప్తి చెందితేనే అండ కణాలు విడుదలై గర్భం వస్తుదని విన్నాను. మరి నేను అలాంటిదేమీ లేకుండానే ఇద్దరు పిల్లలకు తల్లినయ్యా. ఎలా సాధ్యమైంది.? 
 
భావప్రాప్తికి, గర్భం దాల్చడానికి ఎలాంటి లింకు లేదు. యోనిలో వీర్యస్ఖలనం జరిగాక.. శుక్రకణాలు అండంలో కలిసిపోయి ఫలదీకరణ జరిగితే గర్భం వస్తుంది. గర్భం రావడానిక స్త్రీపురుషుల భావప్రాప్తికి ఎలాంటి లింకు లేదు. పురుషుడు భావప్రాప్తి పొందకుండా వీర్యాన్ని పూర్తి స్థాయిలో స్ఖలించక పోయినా గర్భం వచ్చేందుకు ఆస్కారముంది. ఎందుకంటే.. సెక్స్ చేసే సమయంలో స్ఖలనానికి ముందు పురుషాంగం నుంచి వచ్చే ద్రవాలలో గర్భం వచ్చేందుకు అవసరమైన శుక్రకణాలు ఉంటాయి. 
 
ఇకపోతే.. భావప్రాప్తి అనేది వారివారి మనస్తత్వాలు, లైంగిక కోర్కెలపై ఆధారపడివుంటుంది. సెక్స్ పట్ల అమితాసక్తి, కామవాంఛ అధికంగా ఉండే వారు శృంగారంలో పాల్గొన్న కొద్దిసేపటికే భావప్రాప్తికి లోనయ్యే అవకాశముంది. మరికొందరైతే సుదీర్ఘ సమయం పాటు రతిలో పాల్గొనడం వల్ల భావప్రాప్తి పొందే అవకాశముంది. మొత్తంమీద రతిలో పాల్గొన్న స్త్రీపురుషులు తమకు తెలియకుండానే భావప్రాప్తికి లోనవుతారని సెక్స్ నిపుణులు చెపుతున్నారు. ఇలాంటి పరిస్థితినే మీరు ఎదుర్కొంటున్నట్టు ఉన్నారు.