గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2015 (17:46 IST)

సమయం చిక్కినపుడల్లా నా భర్త సెక్స్ చేస్తుంటాడు.. కానీ భావప్రాప్తి కలగదు... ఎందుకని?

నాకు వివాహమై ఎనిమిది నెలలు అయింది. దాంపత్య జీవితంలో ఎలాంటి లోటు లేదు. కానీ, నేను భావప్రాప్తి పొందడం లేదనే భావన నాలో బాగా ఉంది. నిజంగానే భావప్రాప్తి పొందుతున్నానో లేదో నాకు తెలియదు. నా భర్త వీలు దొరికినపుడల్లా సెక్స్ చేస్తుంటాడు. నేను కూడా అతని మాటలకు అడ్డు చెప్పకుండా తలూపుతూ.. సెక్స్ చేయించుకుంటున్నా. కానీ, భావప్రాప్తి పొందడం లేదనే ఫీలింగ్ ఉంది. ఎందుకని.? 
 
సాధారణంగా రతిలో పాల్గొన్నప్పుడు మనస్సు, తనువు పులికించిపోయి పురివిప్పిన మయూరిలా తన్మయత్వం పొందడాన్ని ఆర్గజం లేదంటే సుఖప్రాప్తి లేదా భావప్రాప్తి అంటారు. అయితే కొందరి స్త్రీలలో ఈ భావప్రాప్తి కలగదని సెక్స్ నిపుణులు చెపుతున్నారు. ఈ భావప్రాప్తి కలుగక పోవడానికి తమలో ఏదో శారీరక లోపం ఉందని కొందరు స్త్రీలు భావిస్తారు. క్లైటోరిన్ లేకపోవడమో, యోనిలో కామనాడులు లోపించడమో కారణమనుకుంటారు. ఇలాంటి అపోహలతో భావప్రాప్తి అనేది ఒక మిస్టరీగా మారిపోతుంది. 
 
భావప్రాప్తి కలగడంలో మనస్సు ప్రాధాన్యత అంతాఇంతా కాదు. అలాగే శరీరంలోని కామనాడుల పాత్ర తక్కువేమీ కాదు. శరీరంలో కామనాడులు స్పందించకపోతే మనసు భావప్రాప్తికి సమాయత్తం అవడం కష్టమవుతుంది. అందువల్లనే సెక్స్‌లో సుఖప్రాప్తి అనేది తనువు మనసుల సమ్మేళనం. మనసు, తనువులతోపాటు స్త్రీలో ఈస్ట్రోజన్ హార్మోన్ సెక్స్ స్పందనలకు మూలం. ఈ హార్మోన్ తగినంత ఉత్పత్తి లేనివారిలో యోనిమార్గంలో పొరలు పలుచగా తయారవుతాయి. ఫలితంగా రతి బాధ కలిగిస్తుంది. బాధాకరమైన రతి సుఖప్రాప్తిని కలిగించదు. ఇంకా కొన్ని రకాలైన వ్యాధులు, వ్యసనాలు కూడా ఆర్గజంను అడ్డుకుంటాయి. మత్తుమందు, మాదక ద్రవ్యాలకు అలవాటైన స్త్రీలలో కూడా భావప్రాప్తి ఉండదు.