గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By CVR
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (18:54 IST)

రతి క్రీడలో మగువలు మెచ్చే భంగిమలు...

రతి క్రీడలో ప్రతి రోజూ ఒకే విధమైన భంగిమను పాటిచండం చాలా మంది స్త్రీలకు ఇష్టం ఉండదు. పురుషుడితో సంభోగంలో పాల్గొనే సమయంలో ఆ భంగిమ స్త్రీకి నచ్చకుంటే సున్నితంగా మగాడిని పక్కకు తోసివేస్తుంది. ఆ సంకేతాలను చాలా మంది పురుషులు గ్రహించక మళ్లీ మళ్లీ అదే భంగిమలో సెక్స్ కొనసాగిస్తుంటారు. తద్వారా మరో సారి సెక్స్ చేసేందుకు స్త్రీకి ఇష్టం లేకుండా పోతుంది. కాబట్టి మగాడు రతి క్రీడలో మాత్రం సహచరి ఇష్టాన్ని కూడా గమనించాలి. అప్పుడే ఆ రతి సంపూర్తి చెందుతుంది.
 
సంభోగం రోజూ ఒకేలా చెయ్యకుండా వివిధ భంగిమల్లో రతి క్రీడను జరిపితే దంపతులిద్దరికీ కొత్త అనుభూతి కలుగుతుంది. సెక్స్‌లో రోజు రోజుకూ ఉత్తేజం, ఉత్సాహం పెరుగుతుంది. వాత్సాయన కామసూత్రాల్లో వివిధ రకాల భంగిమలున్నాయి. అయినప్పటికీ వాటిలో మగువలు మెచ్చే భంగిమలు కొన్నేనంటున్నారు నిపుణులు. వాటిలో కొన్ని...
 
రోజంతా ఇంట్లో, బయట పరుగులు తీసి అలసిపోయిన, రాత్రికి భర్త పక్కన పడకెక్కిన స్త్రీ తను కింద ఉండి తన భాగస్వామి పై నుండి చేసే రతి పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తుందట. సాధారణంగా ఎక్కువమంది స్త్రీలు ఇదే భంగిమను ఇష్టపడతారు. ఈ భంగిమలో అయితే స్త్రీ పురుషులిద్దరు ఒకరి ముఖాల్లో ఒకరు చూసుకుంటూ వారి వారి పెదాలను పెనవేసుకుంటూ రతి చెయ్యవచ్చు. 
 
ఇక రెండవది పురుషుడు కింద ఉండి స్త్రీ పైన ఉండి రతి చేసే భంగిమ. ఈ భంగిమను శృంగార పరమైన కోర్కెలు ఎక్కువగా కలిగిన స్త్రీలు అధికంగా ఇష్టపడతారు. ఈ భంగిమలో స్త్రీలు త్వరగా భావప్రాప్తి పొందుతారు. ఈ భంగిమలో అంగ ప్రవేశము సులభమే.
 
మూడవ భంగిమలో స్త్రీ వంగి ఉన్నప్పుడు పురుషుడు ఆమె వెనుక నుండి అంగ ప్రవేశం చేసే రతి. పై రెండు భంగిమల తర్వాత సంభోగంలో స్త్రీ ఈ భంగిమ పట్ల ఆసక్తి కనబరుస్తుందట. ఒక వ్యక్తికి రియర్‌ ఎంట్రి (వెనుక నుంచి సంభోగించడం) బాగా నచ్చిన భంగిమ అయినట్టయితే, ఆ భంగిమలో సెక్స్‌ చేసేటపుడు అతని అంగం మరింత ఎక్కువ గట్టి పడడం, మైధున వేగం పెరగటం, ఉద్రోక్తంతో శబ్దాలు చేయడం జరుగుతుంది.