శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (15:04 IST)

నా గర్ల్ ఫ్రెండ్ నన్ను ఓ వ్యభిచారి వద్దకు పంపి.. సెక్స్‌ రుచి చూసి రమ్మంది.. ఏం చేయాలి?

నాకో గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమెకు నేను పరిచయం కాకముందే ఓ బాయ్‌ఫ్రెండ్‌ ఉండేవాడు. పెళ్ళికి ముందే సెక్స్‌కు ప్రతిపాదన చేయడంతో అతనిని వదిలివేసి.. నాతో పరిచయం పెంచుకున్నట్టు తెలిపింది. గత నాలుగేళ్లుగా మంచి ప్రేమికుల్లా మసలుకుంటున్నాం. నా గర్ల్ ఫ్రెండ్ వయస్సులో నా కంటే ఐదేళ్లు చిన్నది. పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాం. దీంతో దాంపత్య జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు విపులంగా చర్చించుకుంటాం. పెళ్లికి ముందే సెక్స్ (ప్రీ సెక్స్)పై కూడా మా యిద్దరి మధ్య తరచుగా చర్చకు వస్తుంది. 
 
అయితే, ఓ రోజున ఒక వ్యభిచారి వద్దకు తీసుకెళ్లి.. అమెతో సెక్స్‌లో పాల్గొని రమ్మని ఒత్తిడి చేసింది. ఆమె మాట కాదనలేక వ్యభిచారి ఉండే గదికి వెళ్లి ఓ గంట పాటు మసాజ్ చేయించుకుని, ముద్దు పెట్టి వచ్చేశాను. ఎందుకంటే.. ఒక వ్యభిచారితో నా తొలి సెక్స్‌ అనుభవాన్ని పాలుపంచుకోవాలన్న ఆశలేదు. అందుకే ఆమెతో సంభోగించలేదు. గది వెలుపలకు వచ్చాక.. సెక్స్ చేశావా అని నా గర్ల్ ఫ్రెండ్ అడిగితే లేదని చెప్పాను. 
 
అంతే ఒక్కసారిగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. ఆమె ఇలా ఎందుకు ప్రవర్తించిందో నాకు అర్థం కావడంలేదు. బహుశా.. నా గర్ల్ ఫ్రెండ్‌కు తన మాజీ ప్రియుడితో సెక్స్ సంబంధం ఉండివుంటుందని, అందుకే నన్నుకూడా పెళ్లికి ముందే పరాయి స్త్రీతో సెక్స్‌లో పాల్గొనేలా ఒత్తిడి చేస్తున్నట్టుగా భావిస్తున్నాను. ఇలాంటి గర్ల్ ఫ్రెండ్‌తో స్నేహం కొనసాగించవచ్చా లేదా సలహా ఇవ్వండి.    
 
ఖచ్చితంగా మీరు ఊహించుకుంటున్నదే నిజం. నిజమైన ప్రేమ చూపించే గర్ల్ ఫ్రెండ్.. మరో యువతితో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేయదు. ప్రోత్సహించదు కూడా. ఆమె మిమ్మలను నిజంగానే వివాహం చేసుకోవాలని, మీతోనే జీవితాన్ని పంచుకోవాలని కోరుకునేది అయితే, వ్యభిచారి వద్దకు తీసుకెళ్లి సెక్స్‌ రుచి చూసి రమ్మని చెప్పివుండదు. ఈ విషయంపై ఖచ్చితంగా బాగా ఆలోచన చేయండి. 
 
మిమ్మలను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నప్పటికీ.. ఆమె మీతో సెక్స్‌లో పాల్గొనలేదు గాక, మరో యువతితో సెక్స్‌లో పాల్గొనమని చెప్పింది. అందువల్ల మీ గర్ల్ ఫ్రెండ్‌ను వివాహం చేసుకునే ముందు అన్ని విషయాలపై నిశితంగా ఆలోచన చేయండి. ఆమె పాత బాయ్‌ఫ్రెండ్ గురించి ఆరా తీయండి. పైగా వారిద్దరికీ ఇంకా పరిచయాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని కనుక్కోండి. మిమ్మలను వాడుకునేందుకే మీ గర్ల్ ఫ్రెండ్ మీతో స్నేహం చేస్తోందనే విషయాన్ని గ్రహించి.. ఈ బంధానికి స్వస్తి చెప్పండి.