గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : బుధవారం, 25 మార్చి 2015 (17:56 IST)

బెడ్రూం సన్నివేశాలు వీడియో తీస్తూ.. జస్ట్ ఫర్ ఫన్ అంటున్నాడు.. ఏం చేయాలి?

నా వయస్సు 34 యేళ్లు. నా భర్తకు 40 యేళ్ళు. నాకు వివాహమై తొమ్మిదేళ్లు అయింది. నా భర్తకు ఓ చెడు అలవాటు ఉంది. సమయం చిక్కినపుడల్లా పోర్న్ సిడీలు చూస్తుంటాడు. పైగా మా పడగ గదిలో జరిగే సన్నివేశా (సెక్స్)న్ని కూడా వీడియో రికార్డు చేస్తుంటాడు. ఆయన ఫోనులో అనేక నగ్న ఫోటోలు ఉన్నాయి. ఇదేం పని అడిగితే.. మన దాంపత్య జీవిత విశేషాలను ఓ జ్ఞాపకంగా భద్రపరుస్తున్నట్టు సమాధానమిస్తాడు. 
 
ఈ వీడియోల్లో అనేక వీడియోలు మేమిద్దరం గుర్తు పట్టేలా ఉన్నాయి. దీంతో నాలో భయం పట్టుకుంది. పొరపాటున ఎవరికైనా షేర్ చేస్తే పరువు పోతుందన్న భయం వెంటాడుతోంది. ఇదే విషయంపై అనేకసార్లు ఆయనను హెచ్చరించాను కూడా. అయినా ఆయన సీరియస్‌గా తీసుకోవడం లేదు. జస్ట్ ఫర్ ఫన్ అంటున్నాడు. పైగా మేమిద్దరం శారీరకంగా కలిసిన ఉన్న వీడియోలను పలు పోర్న్ సైట్లలో చూశాను. దీంతో మరింత భయం పట్టుకుని నిలదీశాను. అపుడు కూడా అలానే తేలిగ్గా తీసిపారేశాడు. నా భర్తకు ఏమైంది. ఆయన పరిస్థితి నాకేం అర్థం కావడం లేదు. ఆయనను బాధ పెట్టకుండా ఎలాంటి చర్య తీసుకోవచ్చు. 
 
భర్త నొచ్చుకున్నా కూడా.. పడక గదిలో జరిగే సన్నివేశాలు, సంగతులను రికార్డ్ చేయవద్దని గట్టిగానే చెప్పండి. దీనివల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని, పరువు ప్రతిష్ట మంటగలిసి పోతాయని గట్టిగానే చెప్పండి. సాధారణంగా చాలా మంది పురుషులకు తమ వ్యక్తిగత రహస్యాలను పంచుకోవాలన్న ఉబలాటం ఉంటుంది. అందువల్ల ఏదో ఒక రోజున అతని స్నేహితులకు ఈ వీడియోలను చూపిస్తాడు. అందువల్ల పడక గదిలో సెక్స్ సెషన్‌ను రికార్డ్ చేయడాన్ని విధిగా వ్యతిరేకించండి. 
 
40 యేళ్లు దాటిన పురుషుల్లో శృంగార కోర్కెలు మరింతగా పెరుగుతాయి. అదేసమయంలో సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది. దీంతో ఈ తరహా చర్యలకు పాల్పడుతారని చాలా పరిశోధనల్లో తేలింది. తద్వారా తమలో శృంగార ప్రేరేపణలు కలిగేలా చేసుకుని దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారని పలువురు వైద్యులు చెపుతున్నారు. అందువల్ల నిర్మొహమాటంగా పడక గది విషయాలు రికార్డు చేయడానికి సమ్మతించవద్దు.