శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By pnr
Last Updated : ఆదివారం, 4 అక్టోబరు 2015 (12:15 IST)

ఆయన 3 నిమిషాల్లో క్లైమాక్స్‌‍కు చేరుకుంటున్నారు... ఇదొక లోపమా?

మాకు వివాహమై నాలుగేళ్ళు అయింది. అప్పటి నుంచి ఆయనతో తృప్తిగా లైంగిక క్రీడను కొనసాగించలేకపోతున్నా. దీంతో మా ఇద్దరి మధ్య సఖ్యత కొరవడింది. దీనికి కారణం ఆయనకు సరిగ్గా 3 నిమిషాల్లో క్లైమాక్స్ దశకు చేరుకుంటే నాకు 10 నిమిషాల సమయం పడుతుంది. ఇలా నెల మొత్తంలో జరిగే లైంగిక చర్యల్లో ఏ ఒక్కదానిలోనూ నేను దాంపత్య తృప్తిని పొందలేక పోతున్నా. కేవలం మూడంటే మూడు నిమిషాల వ్యవధిలో క్లైమాక్స్‌కు చేరుకోవడం ఆయనలోని లోపమా? సాధారణంగా స్త్రీపురుషుల మధ్య ఇంటర్‌కోర్స్‌కు ఎంత సమయం పడుతుంది? 
 
రతి క్రీడలో పాల్గొనే స్త్రీపురుషులు.. క్లైమాక్స్‌కు చేరుకునే సమయం ఒక్కొక్కరిలో ఒక్కోవిధంగా ఉంటుంది. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. సెక్స్ టెన్షన్, సెక్స్‌లో పాల్గొనే ఫ్రీక్వెన్సీ, కుటుంబ బరువు బాధ్యతలు, వాతావరణం ఇలా ప్రతి అంశం శృంగారంపై ప్రభావం చూపుతుంది. దీంతో సంభోగ సమయం కూడా మారుతుంది.  
 
అయితే, ఇక్కడ 3 నిమిషాలు అనేది చాలా తక్కువ సమయం. శృంగారంలో పాల్గొనే ప్రతి స్త్రీపురుషుడు.. శారీరకంగా కలిసేందుకు ముందు ఫోర్ ప్లే పాటించడం ఎంతో ముఖ్యం. అంటే అంగ ప్రవేశానికి ముందు తగినంత లైంగిక ప్రేరణ పొందడం ఎంతో ముఖ్యం. అనేకమంది స్త్రీపురుషులను లైంగిక చర్యకు సిద్ధం చేయాలంటే వారిని లైంగికంగా ప్రేరేపించాలన్న విషయం చాలామందికి తెలియదు. 
 
ఫలితంగా లైంగిక క్రీడలో తుస్‌మనిపిస్తూ ఇద్దరూ అసంతృప్తికి లోనవుతుంటారు. అయితే, దంపతులిద్దరూ సమానంగా లైంగిక తృప్తి పొందాలంటే లైంగిక మెలకువలు తెలుసుకుని వాటిని అనుసరించినట్టయితే, దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది.