శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (17:03 IST)

భార్యాభర్తల మధ్య రిమోట్‌ కోసం జగడమొద్దు.. రాజీ పడండి!

భార్యాభర్తల మధ్య చిన్న చిన్న జగడాలే విడాకులేంటి.. హత్యలకు దారి తీస్తుంది. ఇటీవలే రిమోట్ కోసం భార్యాభర్తల మధ్య ఏర్పడిన వివాదం మాజీ హెయిర్ హోస్టెస్ రీతు హత్యకు కారణమైంది. సాధారణంగా టీవీ చూడటం ఆయనకిష్టం. మీకూ టీవీ చూడాలనుకున్నప్పుడు భర్తను డైవర్ట్ చేసే ప్రయత్నం చేయండి. మహిళలు అయితే టీవీ సీరియల్స్ కోసం, పురుషులు క్రికెట్ వగైరాలు చూస్తుండిపోతారు. 
 
పురుషుల చేతిలో రిమోట్ దొరికితే ఏదో ఒక ఛానెల్ చూసే పరిస్థితి దాదాపు ఉండదు. అంతా గజిబిజి. మాట్లాడుకోవడానికి టైమ్ దొరకని యాంత్రిక జీవన శైలిలో, భార్యాభర్తల మధ్య టీవీ రిమోట్ పెద్ద సమస్యగా మారింది. అంతేగాకుండా డైనింగ్ టేబుల్ సమావేశ వేదిక అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దాన్నికూడా వదిలేసి టెలివిజన్ ముందే కంచాలు ఒళ్ళో పెట్టేసుకుని, ఎడం చేత్తో రిమోట్ నడిపిస్తూ టెలివిజన్ చూస్తూ భోజనాలు కానిస్తుంటే ఇక మాటలకు చోటెక్కడ? గుడ్ నైట్ చెబుతున్నా పట్టించుకోకుండా టెలివిజన్‌కి అతుక్కుపోయే వారెందరో ఉన్నారు. 
 
అలాంటి వారు మీరైతే.. భార్యాభర్తల మధ్య రాజీ అనేది ముఖ్యం. భర్త కోసం భార్య, భార్య కోసం భర్త రాజీ పడితే జీవితం సుఖమయమవుతుందని మానసిక నిపుణులు అంటున్నారు. ఇంకా టీవీ చూసే విషయంలో భార్యాభర్తలు ఒక అంగీకారానికి రావాలి. ఇద్దరికీ ఇష్టమైన ప్రోగ్రామ్‌లు, సీరియల్స్ చూడడంపై ఒక అంగీకారం కుదరాలి. అలా కాకపోతే శ్రీవారు చూడకుండా టీవీ స్విచ్ కట్టేసి కబుర్లు మొదలు పెట్టడం చాలా మంచిదని మానసిక నిపుణులు అంటున్నారు.