గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : శనివారం, 25 జులై 2015 (16:29 IST)

పక్కింటామె వస్తుంటే దొంగచూపులు చూశా... మా ఆవిడ క్లాస్ పీకుతోంది.. ఏంచేయాలి?

మాది హైదరాబాద్. ఇటీవల మా ఇంటిపక్కనే ఓ కుటుంబం అద్దెకు వచ్చింది. ఆ భార్యాభర్తలిద్దరూ చాలా స్మార్ట్‌గా, చూడచక్కగా ఉన్నారు. అలా రోజులు గడిచేకొద్దీ ఆమె నాకు పరిచయమైంది. దీంతో ఆమె వచ్చేటప్పుడు.. వెళ్లేటప్పుడు నా కళ్లు ఆమెవైపు మళ్లసాగాయి. ఈ విషయాన్ని నా భార్య గుర్తించి.. ఆమెను ఎందుకు దొంగచూపులు చూస్తున్నారు.. నాలో ఏం తక్కువా అంటూ నన్ను నిలదీసింది. అదేసమయంలో పక్కింటావిడ కూడా నాపై ఫిర్యాదు చేసింది. దీంతో నా భార్య నాకు ప్రతి రోజూ క్లాస్ పీకుతోంది. ఆమెను మళ్లీ నాదారికి తెచ్చుకోవడమెలా?
 
అసలు పక్కింటావిడను మీరు ఏ ఉద్దేశ్యంతో చూశారో మీరే చెప్పాలి. అదేసమయంలో మీ భార్య అనుమానం పూర్తిగా తొలగిపోయాలంటే భార్యతో మరింత సన్నిహితంగా మెలగండి. పైగా ఆమె ప్రేమను పొందటం కోసం మరింత ప్రేమను చూపించండి. ఆమె తప్ప మరెవ్వరు మీ మనస్సులో లేరనే భావం ఆమెలో కలగించేలా ప్రయత్నించండి. అలాగే, పక్కింటావిడ మళ్లీ తప్పుడు ఆరోపణలు, ఫిర్యాదులు చేయకుండా జాగ్రత్త వహించండి. చాడీలు చెప్పే స్త్రీల పట్ల మరింత జాగ్రత్త వహించండి. ఆమెను వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు ఆమెను దొంగ చూపులు చూడకుండా జాగ్రత్త వహించండి.