శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : శనివారం, 25 జులై 2015 (05:28 IST)

చేతివేళ్ళతో మర్మాంగాన్ని తాకి తృప్తిపడుతోంది.. ఇదేం అలవాటు?

నాకో గర్ల్‌ఫ్రెండ్ ఉంది. ఇద్దరం చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నాం. అన్ని అంశాలపై ఇద్దరి అభిప్రాయాలను వెల్లడిస్తుంటాం. కానీ, మా మాటల మధ్య ఇప్పటివరకు పెళ్లిప్రస్తావన అనేది రాలేదు. అదేసమయంలో ఆమెను హగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం చేస్తున్నాను. ఆమె మాత్రం నా మర్మాంగాన్ని చేతివేళ్ళతో తాకి తృప్తిపడుతోంది. ఇదేం అలవాటో నాకైతే అర్థంకావడం లేదు. ఆమె ఎందుకలా చేస్తోంది. 
 
ఇదికూడా ఓ రకమైన స్వయంతృప్తి పొందే చర్యే. అంగాన్ని అలా తాకడం వల్ల ఆమెలో కామ ఉద్దీపనులు కలిగి.. స్వయంతృప్తి పొందుతూ ఆనందిస్తుంది. అంటే డైరెక్టుగా సెక్స్‌లో పాల్గొనకుండా తన మనస్సుకు నచ్చిన వ్యక్తితో ఈ తరహా చర్యల్లో పాల్గొనడం వల్ల తాను పొందదలచుకున్న ఆనందాన్ని, స్వయంతృప్తిని పొందుతుంది. 
 
పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొన్నట్టయితే గర్భం, సుఖ వ్యాధులు వంటివి వస్తాయన్న భయం ఆమె మనస్సులో ఉంటుంది. పైగా.. ఎపుడు కూడా పెళ్లి ప్రస్తావన రాలేదని అంటున్నారు. ఒకవేళ పరాయి వ్యక్తిని వివాహం చేసుకున్నట్టయితే అతనికి తన ముందస్తు సెక్స్ అనుభవం తెలుస్తుందన్న భయం కూడా ఆమెను వెంటాడుతూ ఉండొచ్చు. అందువల్లే చేతివేళ్ళతో అంగాన్ని స్పృశిస్తూ స్వయంతృప్తి పొందుతున్నట్టుగా ఉంది.