గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (17:15 IST)

ఇంగ్లీష్ సినిమాల్లో సీన్లు బాగుంటాయి.. అలా చేసుకుందామంటే వద్దంటారు.. ఏం చేయాలి?

నా వయస్సు 28 యేళ్లు ఓ బాబు ఉన్నాడు. నాకు కోర్కెలు ఎక్కువ. పడకగదిలో కొత్తకొత్త ప్రయోగాలు చేస్తూ ఎంజాయ్ చేయాలని భావిస్తాను. కానీ, మావారు అలాంటి ప్రయోగాలకు వద్దంటారు. దీనికి కారణం లేకపోలేదు. కొత్త భంగిమలో చేయడం వల్ల విఫలమవుతాననే భయం ఆయనన పట్టి పీడిస్తోంది. దీనివల్ల ఇద్దరం తీవ్ర నిరుత్సాహానికి లోనవుతామని చెపుతున్నారు. పైగా.. వాళ్ళది నటన అని, అలా మన సెక్స్ ఉండకూడదని అంటున్నారు. కానీ, నాకు మాత్రం ఆయనను ఎలాగైనా ఒప్పించి అలా చేయాలని వుంది. ఏం చేయమంటారు.? 
 
సాధారణంగా చాలా మంది పురుషులు కొత్త ప్రయోగాలకు సాహసంచేయరు. ఎందుకంటే ఆ ప్రయోగాల్లో విఫలమైతే.. తమ భాగస్వాముల వద్ద చులకన అవుతామనే భయం వారిని వెంటాడుతుంది. అందువల్ల చాలా మంది పురుషులు దాంపత్య జీవితంలో ప్రయోగాలకు ససేమిరా అంటారు. పైగా ఇతరులను ఊహించుకోవడం లేదా అనుకరించడమనేది అనైతికమే అవుతుందన్న భావన ఏర్పడుతుంది. అంతేకాకుండా తనకు తెలిసిన భంగిమలు ఇతర పురుషులకు తెలియని, అలాంటపుడు ఇతరుల భంగిమలు తాను అనుకరించడం అంటే తనను తాను తక్కువ చేసుకున్నట్టేనని భావిస్తారు.