గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By pnr
Last Updated : మంగళవారం, 15 డిశెంబరు 2015 (16:47 IST)

30 యేళ్ళ వరకు ఆలోచనలు లేవు... కానీ ఆ ఇద్దరు మహిళలు అలా చేసేశారు?

మాది పేద కుటుంబం. కుటుంబ పరిస్థితుల కారణంగా వివాహానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. పైగా చిన్న వయస్సు నుంచే చదువు మానేసి వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు నాన్న చనిపోయారు. ప్రస్తుతం అందరితో కలిసి ఉంటున్నాను. మా వాళ్లు నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతున్నారు. నేను 30 సంవత్సరాల వయస్సు వరకు పరాయి స్త్రీల జోలికి వెళ్లలేదు. 
 
ఆ తర్వాత మా గ్రామంలో ఒకరిద్దరు నన్ను బలవంతంగా లొంగదీసుకున్నారు. ఈ మధ్యకాలం దాకా వారి బలవంతంతోనే కలుసుకోవడం జరిగింది. ఇప్పుడు అలాంటివి మానేశాను. ఒక సంవత్సరం నుంచి అంగం సరిగా గట్టిపడటం లేదు. కుడివైపు బీజం కొద్దిగాలావుగా ఉండి, నొప్పిగా ఉంటోంది. దీనివల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా? నాకు జీవితంలో తోడు కావాలనుకుంటున్నా. పెళ్లి చేసుకుని జీవితాన్ని ఎంజాయ్ చేయాలని భావిస్తున్నా. ఏం చేయాలి? 
 
ఎంత పేదిరికంలో ఉన్నా సరైన సమయంలో పెళ్లి చేసుకోవాలి. అంతేకానీ, కుటుంబ బాధ్యతల కారణంగా చూపి... వైవాహిక జీవితానికి దూరంగా ఉండరాదు. పైగా, పెళ్లి చేసుకోకుండా అక్రమ సంబంధాల్లోకి వెళ్ళారు. ఇప్పుడు తోడు కావాలనుకుంటున్నారు. సమస్య వచ్చినప్పుడు కృంగిపోవాల్సి అవసరం లేదు. అందువల్ల సరైన సెక్స్ వైద్య నిపుణుడిని సంప్రదించి సలహా తీసుకుని జీవితాన్ని ఎంజాయ్ చేయండి.