శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : బుధవారం, 12 నవంబరు 2014 (17:43 IST)

భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆంటీతో సెక్స్‌లో పాల్గొన్నా.. ఇటీవలే చనిపోయింది.. నేను కూడా...!!

నేను ఓ మానసిక సమస్యతో బాధపడుతున్నా. నా భార్య గర్భవతి కావడంతో ఓ సంవత్సరం పాటు పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ సమయంలో కోర్కెలు అణుచుకోలేక తనతో చనువుగా ఉండే పక్కింటి ఆంటీతో సెక్స్‌లో పాల్గొన్నా. అలా నాలుగైదు నెలల పాటు ఆమెతో శారీరక సంబంధం కొనసాగించాను. అయితే, ఇటీవల ఆ ఆంటీ చనిపోయింది. ఆమె చనిపోయేందుకు మూడు నెలలపాటు తీవ్రమైన దగ్గుతో బాధపడింది. రాత్రిళ్లు మరీ ఎక్కువగా దగ్గేది. అంటే ఆమెకు ఉన్న ఆ దగ్గు నాకూ వస్తుందా? సలహా ఇవ్వండి?
 
మీరు ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సమయంలో ఆమె ఆరోగ్యంగానే ఉన్నది. అపుడు ఆమెకు ఎలాంటి దగ్గులేదు. మీరు ఆమెతో సెక్స్ సంబంధం తెంచుకున్న తర్వాత ఆమె అనారోగ్యానికి గురై చనిపోయినట్టుగా ఉంది. పైగా ఆమె ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడింతో మీకు తెలియదు. అంతమాత్రానా ఆమెలాగే అనారోగ్యం బారిన పడుతారని భావించడం సరికాదు. ఉబ్బసం ఉండే రోగులు రాత్రి పూట ఎక్కువగా దగ్గుతారు. పైగా ఆమె సరైన చికిత్స చేయించుకునివుండరు. అందువల్ల ఆమె మరణాన్ని తలచుకుంటూ బాధపడటం మానేయండి. మరీ అంతగా సందేహంగా ఉండే మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోండి. మీ సందేహాలన్నీ నివృత్తి అవుతాయి.