బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 17 నవంబరు 2014 (19:11 IST)

నా మాజీ ప్రేయసి జ్ఞాపకాలు వదలడంలేదు... అనుక్షణం ఆమె గుర్తొస్తోంది...

పదేళ్ల క్రితం ఓ అమ్మాయని ప్రేమించాను. ఆమె చాలా అందగత్తె. ఆమె అందం గురించి మా కాలేజీలో ఓ యువకుడు పొగడ్తలు చేస్తే అతడికి నేను దేహశుద్ధి చేశాను. అలా ఆమె అంటే ప్రాణంగా చూసుకునేవాడిని. కానీ ఇద్దరి మధ్య చిన్నమాట రావడంతో విడిపోయాము. సారీ చెప్పి ఉంటే బావుండేది. కానీ పట్టుదలతో అలాగే ఆమెతో మాట్లాడకుండా ఉండిపోయాను. 
 
ఆ తర్వాత ఆమె కూడా నాతో మాట్లాడేందుకు ప్రయత్నించలేదు. ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. కానీ ఇప్పుడు నా భార్యతో కలిసి ఏది చేస్తున్నా నా మాజీ ప్రేయసి గుర్తొస్తోంది. ఎంత మర్చిపోదామని అనుకున్నా కుదరడం లేదు. ఆమెతో మళ్లీ మాట్లాడి నా బాధను చెప్పి స్నేహం చేస్తే ఇదంతా పోతుందేమోననిపిస్తోంది. ఏం చేయమంటారు..?
 
తొలిప్రేమను మర్చిపోవడం ప్రేమించినవారికెవరికైనా కష్టమే. కానీ ఇద్దరిలో ఎవ్వరు కూడా పట్టువిడుపులు లేకుండా వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ పాత ప్రేయసి గుర్తుకు వస్తుందనడంలో అర్థంలేదు. పైగా పెళ్లయ్యాక ఇంకా ఆమెతో స్నేహం ఏమిటి...? ఆమె బహుశా... మీరు ఫోన్ చేసి సంప్రదించినా ఒప్పుకోకపోవచ్చు. ఒకవేళ ఒప్పుకున్నా అది స్నేహంతో ఆగదు. కాబట్టి పాత జ్ఞాపకాలను మరిచిపోయి మీ భార్యాబిడ్డల తోటిదే లోకంగా మసలిందేకు ప్రయత్నించండి. ఐనా ఆమె జ్ఞాపకాలు వెంటాడుతుంటే మానసిక వైద్యులను సంప్రదించండి.