శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By CVR
Last Modified: మంగళవారం, 21 అక్టోబరు 2014 (16:17 IST)

సెక్స్‌లో శీఘ్రస్కలనం సమస్య వేధిస్తోందా.. కొన్ని చిట్కాలు

పురుషుల్లో కొంత మందిని శ్రీఘ్రస్కలనం సమస్య ఎక్కువగా వేధిస్తుంటుంది. రతి ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోపే వీర్యం స్కలించి మూడ్ అవుట్ అయిపోవడంతో భార్యా భర్తలిద్దరూ తీవ్రమైన అసంతృప్తికి లోవుతుంటారు. ఈ సమస్యను వైద్యుని సహాయంతో కొంత వరకూ అధికమించినా భార్యాభర్తల మధ్య ఉన్న అన్యోన్యతతోను, పురుషుడు కొన్ని చిట్కాలు పాటించడంతోను ఈ సమస్య నుంచి బయటపడవచ్చునని నిపుణులు అంటున్నారు.
 
శీఘ్రస్కలనానికి అనేక కారణాలున్నాయి. ఆఫీసులో పని వత్తిడి, ఎక్కువై అదే టెంక్షన్‌తో ఇంటికి వచ్చి భార్యతో యాంత్రికంగా సంభోగంలో పాల్గొనడం వల్ల కూడా త్వరగా స్కలనం జరగవచ్చు. 
 
అసలు శీఘ్రస్కలం కాకుండా ఉండాలంటే హస్త ప్రయోగ విధానం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. హస్త ప్రయోగం చేసే సమయంలో ఉద్రేకతను పెంచుకుని వేగంగాను స్కలించుకోవచ్చును. లేదా నెమ్మదిగాని పాటించి ఆలస్యంగాను స్కలించి సుఖాన్ని పొందవచ్చు. 
 
సాధారణంగా పురుషులు హస్త ప్రయోగం చేసే సమయంలో అవసరంగా, ఉద్రేకంగా చేస్తారు. ఎవరైనా చూస్తారేమో అనే నెపంతో మనసులో ఉన్న ఆశను ఆవేశంగా వెల్లగక్కేస్తారు. ఈ విధమైన అలవాటే సెక్స్ చేసే సమయంలో కూడా పాఠించడంతో శీఘ్రస్కలం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. 
 
మొదట పురుషుడు తన అంగ స్తంభించినప్పటి నుంచి వీర్యం స్కలించి, మామూలు స్థితికి వచ్చేంత వరకు నెమ్మదిని పాఠించాలి. వీర్యం స్కలించే సమయంలో మనసును కొంత సేపు పక్కకు మల్లించి, మళ్లీ హస్త ప్రయోగం చేయడం ప్రారంభించాలి. అప్పుడప్పుడు ఇలా చేసి చూడడం మంచిది. ఏదో ఒక రోజు ఈ విధమైన ప్రయత్నం చేస్తే సరి పోదు. రోజుకు రెండు సార్లైనా ఈ విధంగా నెమ్మదిగా హస్త ప్రయోగం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. 
 
తొలుత కొంత సేపు ఒట్టి చేతితో హస్త ప్రయోగం చేయాలి. తర్వాత నూనె, జల్లీ వంటి పురుషాంగానికి పూసి మళ్లీ హస్త ప్రయోగం చేయాలి. స్కలించే విధంగా ఉంటే, మనస్సును కొంత సేపు పక్కకు మళ్లించి మళ్లీ హస్త ప్రయోగం కొనసాగించాలి. ఈ విధంగా స్కలించే సమయాన్ని పెంచుకుంటూ పోవాలి. ఈ విధమైన టెక్నిక్‌నే స్త్రీతో రతిక్రీడలో పాల్గొనే సమయంలో కూడా పాటించినట్లైతే మంచి ఫలితం ఉంటుంది. 
 
అదేవిధంగా రతి క్రీడలో ఆలూమగలూ మనసు విప్పి తన భావాలను వ్యక్తం చేసుకోవాలి. ఎక్కువగా ఫోర్ ప్లేకు అధిక ప్రాధాన్యతినివ్వాలి. సంభోగంలో ముద్దులు, కౌగిలింతలకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వండ వల్ల స్త్రీ చాలా వరకూ సంతృప్తి చెందుతుంది. ఆ తరువాత అంగ ప్రవేశం చేస్తే త్వరగా స్కలనం అయినా ఆమెకు పెద్దగా అసంతృప్తి ఉండదు.