శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శనివారం, 28 ఫిబ్రవరి 2015 (17:28 IST)

ఆంటీ అంటూ వాడు తన పురుషాంగాన్ని గట్టిగా తాకించాడు...

మా పెళ్లయి రెండేళ్లయింది. ఈమధ్య మా బంధువుల ఇంటికి వెళ్లాను. వరసకు వారు బావ, అక్క అవుతారు. వారి అబ్బాయి చేసిన పని నాకు జుగుప్స కలిగించింది. నేను వంటగదిలో పని చేస్తుండగా... ఆంటీ ఎపుడొచ్చారంటూ వెనుక నుంచి నన్ను కౌగలించుకుంటూ అడిగాడు. 
 
అలా కౌగలించుకున్నప్పుడు వాడి పురుషాంగం స్తంభించి ఉంది. దానిని నా వెనుకవైపు తాకిస్తూ ఏదో మాట్లాడుతున్నాడు. నేను అతి కష్టం మీద వాడిని వదిలించుకున్నాను. ఈ విషయం అక్కతో చెప్పాలనుకున్నా... వాడు ఆమె వద్ద కూడా అలాగే చేస్తున్నాడు. ఏం చెప్పాలో తెలియలేదు. వాడు ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా చేస్తున్నాడేమో అనిపిస్తుంది...!!

 
తల్లిదండ్రులు తమ బిడ్డలకు యుక్త వయసుకు రాగానే ఎలా మసలుకోవాలనే విషయాలను విడమర్చి చెప్పాలి. ఫ్రీడమ్ అనే ఒకే మాటతో వారి వస్త్రాలంకరణ, పద్ధతులను అస్సలు పట్టించుకోవడం లేదు. వాటి దుష్పరిణామాలు ఇలానే ఉంటాయి. ఆ కుర్రాడికి వారి పేరెంట్స్ స్త్రీల పట్ల ఎలా ప్రవర్తించాలన్నది చెప్పినట్లు లేరని అర్థమవుతుంది. 
 
అతడి మదిలో దురాలోచనలు లేకపోయినప్పటికీ యుక్త వయసుకు వచ్చాక వారి శరీరంలో మార్పులు రావడం సహజం. ఆ విషయాలు పేరెంట్స్ కు తెలియనివి కావు. కాబట్టి లోపం పిల్లవాడిలో కాదు.. పెద్దల్లోనే ఉంది. ఈ విషయాన్ని మీ అక్కయ్యకు చెప్పి సరిదిద్దమని చెప్పండి.