గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Updated : సోమవారం, 10 నవంబరు 2014 (18:50 IST)

పెద్దలు కుదిర్చిన పెళ్లి... అతడు శాడిస్ట్... మాజీ ప్రేమికుడితో వెళ్లిపోదామని...

కాలేజీ టైంలో ఓ అబ్బాయి - నేను ప్రేమించుకున్నాం. హద్దులు దాటలేదు కానీ అతడికి నేనంటే ప్రాణం. ఇప్పటికీ నా యోగక్షేమాలు తెలుసుకుంటుంటాడు. ఐతే నా భర్త ఇందుకు భిన్నం. అతడు ఓ శాడిస్ట్. ఎంతకీ నా అభిప్రాయాలకు విలువివ్వరు. ఆయనతో ఇమడలేననిపిస్తోంది. నా పాత స్నేహితుడితో వెళ్లిపోతే బావుండనిపిస్తుంది. ఐతే ఇది మా పెద్దల గౌరవ మర్యాదలతో కూడుకున్నది కావడంతో ఆలోచిస్తున్నా. కానీ నా జీవితం నా భర్తతో సంతోషంగా ఉండదనిపిస్తోంది... ఏం చేయాలి..?
 
పెళ్లి చేసుకుని భర్తతో ఏవో చిన్నచిన్న గొడవలు వచ్చాయని పాత ప్రేమికుడ్ని ఊహించుకుంటూ అతడితో లోకం అనుకోవడం కొందరు చేస్తుంటారు. మూడుముళ్లు కట్టిన భర్తతో మనస్పర్థలు వస్తే పాత ప్రేమికుడి వద్దకు పారిపోవడం పరిష్కారం కాదు. 
 
నూరేళ్లు కలిసి ఉండాల్సిన భర్తను వదిలేసి ఇప్పుడు పాత ప్రేమికుని వద్దకు వెళ్లాలనుకోవడం అనే ఆలోచనను ప్రక్కన పెట్టేసి భర్తతో మీకు వచ్చిన సమస్యను పరిష్కరించుకోవాలి. ఆయన ఖచ్చితంగా ప్రేమగా చూసుకుంటారు. ఇక ప్రేమికుని వద్దకు వెళ్లిపోవడమనేది ప్రేమించినపుడు... అంటే పెళ్లి చేసుకోబోయే ముందు తీసుకోవాల్సిన నిర్ణయం. మీ ప్రేమను మీ తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించి అతడిని పెళ్లి చేసుకుని ఉండాల్సింది. 
 
అలాకాకుండా ఇపుడు పెళ్లి చేసుకుని ఇలాంటి ఆలోచనలు చేయడం మంచిది కాదు. మీ భర్త శాడిస్ట్ అని ఏ కారణం వలన అంటున్నారో తెలియలేదు. ఐతే ప్రేమించుకుని పెళ్లాడిన జంటల్లోనూ ఇలాంటి సమస్యలు రావని గ్యారెంటీ ఉందా... అంటే అదీ లేదు. ఎందుకంటే ఎన్నో ప్రేమ జంటలు చిన్నచిన్న గొడవలతోనే విడాకుల వరకూ వెళ్లిపోతున్నాయి. కాబట్టి పాత జ్ఞాపకాలను మనసు నుంచి తీసేసి కొత్త జీవితం వైపు భర్తతో కలిసి అడుగులేయండి.