గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 27 అక్టోబరు 2014 (15:06 IST)

నా కాలి గజ్జెలు మోగితే ఆయన అంగం మెత్తబడిపోతోంది... మళ్లీ కావలన్నా...

నాకు ఆభరణాలు ధరించడం చాలా ఇష్టం. చిన్నప్పట్నుంచి మా తల్లిదండ్రులు నేను అలంకరించుకునేందుకు నాకు ఇష్టమైన ఆభరణాలను కొని ఇస్తుండేవారు. అలా నాకు వాటిని ధరించకుండా ఉండలేను. నాకు ఇటీవలే వివాహమైంది. ఆయన నన్ను కోరి పెళ్లిచేసుకున్నారు. ఐతే సెక్స్ చేసేటపుడు మాత్రం వింతగా ప్రవర్తిస్తున్నారు. నా శరీరంపై అలంకరణలన్నీ తీసివేయమంటున్నారు. గాజుల్లో ఆ రెండు చేతులకు రెండు గాజులు మాత్రమే వేసుకోమంటారు. 
 
సరేనని అన్నీ పాటించాను. ఈమధ్య సెక్సులో స్ట్రోక్స్ ఇచ్చిన మరుసటి నిమిషంలోనే అంగం మెత్తబడిపోయింది. అదేమని అడిగితే కాలి గజ్జెల సవ్వడి వల్ల అలా జరిగిపోయిందంటున్నాడు. ఇతడికి ఏమైన సౌండ్ ఎలర్జీ ఏమైనా ఉందేమోనని నాకు అనుమానంగా ఉంది... లేదంటే ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు...?
 
కొంతమంది పురుషుల్లో రతి జరిపే సమయాల్లో ఎలాంటి శబ్దాలను విన్నా వెంటనే ముడుచుకుపోతుంటారు. స్తంభించిన పురుషాంగం వెంటనే మెత్తబడి జావగారిపోతుంటారు. దానికి కారణం సెక్స్ అనేది ఏకాంతంగా పాల్గొనే ఓ రహస్య క్రీడ అనే భావన పురుషుల్లో నెలకొని ఉండటం ఒకటయితే తను సెక్స్ చేస్తున్న సమయంలో ఎలాంటి శబ్దాలు ఇతరులకు తెలియరాదన్న భావన మరొకటి. ఈ కారణాల వల్ల అతడి అంగం మెత్తబడి పోతూ ఉండవచ్చు. కాబట్టి దీనిని అధిగమించేందుకు కొన్నాళ్లపాటు పడకగదిలో అలంకరణలకు దూరంగా ఉండి చూడండి.