శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By IVR
Last Modified: శుక్రవారం, 11 జులై 2014 (16:50 IST)

ముద్దు పెడితే డస్ట్ అంటుకుంటుందంటాడు... ఇతడితో ఎలా...?

మా పెళ్లయి ఏడాది గడిచింది. ఆయనకు ఎప్పుడూ పని ధ్యాసే. ఆయన పని ముగించుకుని ఇంటికి రాగానే నేనే చొరవ తీసుకుని ముద్దు పెట్టుకుంటాను. వెంటనే వెనక్కి నెట్టి... బుగ్గ మీదే కాదు... మొహం అంతా డస్ట్ అంటుకుని ఉందనీ, జర్నీ చేసి వచ్చాను కాబట్టి, స్నానం చేసిన తర్వాత కావాలంటే ముద్దు పెట్టుకో అంటారు. సరే అని స్నానం ముగిశాక కిస్ ఇస్తే ఎంగిలి కురుపులు వస్తాయి... ఇలా ఎందుకు చేస్తున్నావంటూ మండిపడతారు. ఆయన ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావడంలేదు....
 
కొందరిలో ఇలాంటి విపరీత ప్రవర్తన ఉంటుంది. కొందరు నిజంగానే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటే మరికొందరు ముద్దుపై ఉన్న అనాసక్తతను ఆవిధంగా తెలియజేస్తుంటారు. మీరు ముద్దు ఇచ్చే పద్ధతిని మార్చుకుని చూడండి. అతడికి బాగా ఇష్టమైన ప్రదేశం ఏంటో తెలుసుకుని ముద్దు అక్కడి నుంచి మొదలుపెట్టండి. తప్పకుండా భవిష్యత్తులో ముద్దులకు అతను ఎట్టి పరిస్థితుల్లో అడ్డు చెప్పడు.