గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By IVR
Last Modified: గురువారం, 17 జులై 2014 (13:17 IST)

నా పురుషాంగం పొట్టిగా లావుగా ఉందట... ఆమెకెలా తెలుసన్నదే ప్రశ్న

నా గర్ల్ ఫ్రెండుతో తొలిసారి సెక్సులో పాల్గొన్నాను. నా పురుషాంగాన్ని యోనిలో ప్రవేశపెట్టాక తృప్తి ఎలా ఉందని అడిగాను. ఆమె బాగానే ఉందని చెపుతూ, అంగం పొట్టిగా లావుగా ఉందనీ, ఇంకాస్త పొడవు ఉన్నట్లయితే ఇంకా బావుండేదని అన్నది. నా అంగం పొట్టిగా ఉందనీ, ఇంకా పొడవు వుండాలని ఆమె ఎలా చెప్పిందన్నదే నా ప్రశ్న. ఆమెకు ఇదివరకే ఎవరితోనైనా పరిచయం ఉందేమోనని నాకు డౌటుగా ఉంది...?
 
ప్రేమికుల్లో కొంతమందికి ఇలాంటి అనుమానాలు, అపోహలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అసలు తప్పంతా మీదే. పెళ్లి కాకముందే సెక్స్ చేయడం తప్పు. పైగా సెక్స్ చేస్తూ ఎలా ఉందని అడిగితే ఏదో ఒకటి చెప్పాలి కదా. అందుకని కొంతమంది ఇలాంటి సమాధానాలే ఇస్తుంటారు. ఇకపోతే పురుషాంగం పొడవు, పొట్టి, లావు వంటివన్నీ ఎలా ఉన్నా... స్తంభించినప్పుడు పురుషాంగం 4 అంగుళాలతో స్తంభనలు బాగా ఉంటే చాలు. పురుషాంగం పొడవుగా ఉన్నదా పొట్టిగా ఉన్నదా అనేది ముఖ్యం కాదు.