బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శనివారం, 16 ఆగస్టు 2014 (14:06 IST)

ఆమెకు సెక్స్ విజ్ఞానం లేదట... నాతో పాల్గొని తెలుసుకుంటానంటోంది...

నేను ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. మా ఆఫీసులో ఇద్దరు యువతులు నాతోపాటు చేస్తుంటారు. వారిద్దరిలో ఒకరికి పెళ్లయింది. మరో అమ్మాయికి ఇంకా కాలేదు. ఓరోజు పెళ్లి కాని యువతికి నాకు మధ్య సెక్సుకు సంబంధించిన చర్చ వచ్చింది. ఆమె చాలా క్యాజువల్ గా కొన్ని సందేహాలు అడిగింది. నేను చెప్పాను. శోభనం రోజున ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా అడిగింది. ఇలా మా చర్చ చాలా దూరం వెళ్లింది. 
 
ఇక అప్పట్నుంచి మామధ్య ఒక్కరోజైనా సెక్స్ సంభాషణ జరుగుతోంది. ఆమెకు పెళ్లి ఫిక్సయిందట. పెళ్లి కాక మునుపు నాతో ఒక్కసారి సెక్సులో పాల్గొని సెక్స్ విజ్ఞానం తెలుసుకుంటానని అంటోంది. నాతో అయితే చాలా చనువుగా ఉంటుందని అడుగుతోంది. ఇలా చేయడం కరెక్టా కాదా అని ఆలోచిస్తున్నాను. ఆమె సెక్స్ విషయాన్ని గుర్తు చేస్తూనే ఉంది. ఏం చేయాలో తెలియడంలేదు....
 
చనువుగా ఉన్నవారిలో కొందరి మధ్య ఇలాంటి చర్చలు జరుగుతుంటాయి. ఐతే ఆమె మరో యువకుడిని పెళ్లాడబోతూ ఇలా మీతో సెక్స్ కావాలని కోరుకోవడం ఆమెలో సెక్స్ పట్ల నెలకొన్న అపోహలు కారణం కావచ్చు. మీతో ఆమె సెక్స్ సంభాషణలు చేసినప్పుడు మీరే ఆమెలో లేనిపోని అపోహలు సృష్టించి ఉంటారనే అనుమానం వస్తోంది. 
 
పరాయి పురుషులతో స్త్రీలు, పరాయి స్త్రీలతో పురుషులు సెక్సు అనేది సమస్యలు తెచ్చి పెడుతాయి. ఆమెకు సర్ది చెప్పండి. సెక్సుకు సంబంధించిన అపోహలేమైనా ఉంటే సెక్సుకు సంబంధిన విజ్ఞానం తెలిపే పుస్తకాలను, సమాచారాన్ని చదివి తెలుసుకోమని చెప్పండి. అంతేకానీ... మీతో సెక్సులో పాల్గొని తెలుసుకోనక్కర్లేదు.