శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Updated : శనివారం, 13 సెప్టెంబరు 2014 (17:51 IST)

మా పిన్ని కూతురుతో మావాడికి లింకుంది... లేచిపోతామంటున్నారు... ఎలా?

మేమిద్దరం సమ వయస్కులం. అన్నదమ్ములం. తరచూ మా పిన్నివాళ్ల ఇంటికి వెళుతుంటాం. ఈమధ్య మా పిన్ని కూతురుతో మా అన్న సన్నిహితంగా ఉండటాన్ని చూశాను. దాంతో దొంగచాటుగా వారినే గమనించాను. వాళ్లిద్దరూ పెదవులపై పెదవులతో ముద్దులు వంటివన్నీ చేసుకున్నారు. నాకు మైండ్ పోయినంత పనైంది. వెంటనే ఆరోజే ఇంటికి వెళ్దామని వాడిని బలవంతంగా తీసుకెళ్లాను. 
 
దారి మధ్యలో పిన్ని కూతురుతో ప్రవర్తన గురించి ప్రస్తావించాను. వాడు చాలా క్యాజువల్ గా ఆమెతో సెక్సులో కూడా పాల్గొన్నానని చెప్పాడు. ఉద్యోగం రాగానే ఇద్దరం లేచిపోతామని అంటున్నాడు. మా అమ్మా నాన్నలకు, మా పిన్ని, బాబాయిలకు ఈ విషయం తెలీదు. వారికి ఎలా చెప్పాలో అర్థంకావడంలేదు. చెబితే ఏమవుతుందోనన్న భయంగా కూడా ఉంది.. ఏం చేయాలి...?
 
ఇలాంటి సంఘటనలు సమాజంలోని వికృత రూపాన్ని చాటిచెపుతుంటాయి. దీనికి కారణం... సెక్సుపై తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటోంది. కౌమారదశకు చేరుకున్న పిల్లలతో తల్లిదండ్రులు ఈ విషయాలపై చర్చించకపోవడం వల్ల ఇలాంటి దారుణాలకు దారితీస్తుంటాయి. దాంతో ఆ వయసులోని యువతీయువకులు అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకుని దానితోటిదే లోకమన్నట్లు గడిపేస్తుంటారు. 
 
దీనిపై తల్లిదండ్రులకు పర్యవేక్షణ లేదు. పిల్లవాడు ఏం చేస్తున్నాడో... ఏ చూస్తున్నాడో తెలుసుకోవడంలేదు. దీంతో వారు అశ్లీల సైట్లను చూస్తూ పెడదోవ పడుతున్నారు. ఒక సర్వే ప్రకారం రక్త సంబంధీకులతో 25 శాతం మంది లైంగిక అనుభవాన్ని చవిచూస్తున్నట్లు తేలిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. మీవాడి విషయాన్ని మీ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాల్సిందే. వారు పెద్దవారు కనుక సరైన నిర్ణయం తీసుకుంటారు. విషయాన్ని ఎంత సాధ్యమైతే అంత త్వరగా చెప్పేయండి.