బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (15:04 IST)

నా భార్య మోజు తీర్చావు... నా మోజెప్పుడు తీర్చుతావూ అంటున్నాడు...

ప్రమాదంలో నా భర్త చనిపోయారు. ఇప్పుడు నా వయసు 24 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. చిన్న వయసులోనే పెళ్లి చేశారు. వితంతువుగా బతుకు ఈడుస్తున్నాను. పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నాను. పెద్దలు ఇచ్చిన ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. డబ్బుకు కొదవలేదు. పశు సంపద కూడా ఉంది. ఇటీవల మా ఊరుకు వ్యాపారం చేసుకునేందుకు ఓ యువకుడు వచ్చాడు. అతడి వయసు 32 ఏళ్లు. పాల వ్యాపారం చేసే అతడు నాతో మాటలు కలిపి స్నేహితుడిగా మారాడు. నా సమస్యలను అతడికి చెప్పుకుంటుంటాను. 
 
ఇటీవల అతడి భార్యకు ఇష్టమైన వంటకాన్ని చేసి తీసుకెళ్లమని అతడికిచ్చాను. మరుసటిరోజు అతడు వచ్చి నా వంటకం చాలా బావుందని అన్నాడు. అలా మాట్లాడుతూనే.... నా భార్యకు ఇష్టమైన వంటకం ఇచ్చి ఆమె మోజు తీర్చావు. మరి నా మోజు ఎప్పుడు తీర్చుతావూ...? అని అడిగేశాడు. 
 
నేను అతడి ముఖంలోకి సూటిగా చూశాను. అతడి చూపులు మాత్రం నా శరీరంలో ఎక్కడెక్కడో గుచ్చాయి. ఎందుకో అతడిపై కోపం రాలేదు. బహుశా... నాక్కూడా సెక్స్ కావాలనిపిస్తున్నట్లనిపించింది. అందువల్ల అతడిని నేనేమీ అనలేదు. కాసేపటికి అతడు వెళ్లిపోయాడు. కానీ నాకు లైంగిక తృప్తి కావాలనిపిస్తోంది. ఐతే అతడితో సెక్సులో పాల్గొంటే ఏమవుతుందోనన్న భయమూ ఉంది... ఏం చేయాలి..?
 
భర్త లేని మహిళలను కొంతమంది పురుషులు ఇలాంటి దృష్టితోనే చూస్తుంటారు. అతడితో లైంగిక సుఖాన్ని పంచుకోవడం వల్ల తృప్తి కలుగవచ్చునేమోగానీ ఆ తర్వాత అంతకుమించిన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పైగా అతడికి భార్యాపిల్లలు ఉన్నారు. అలాగే మీక్కూడా. ఈ పరిస్థితుల్లో ఇద్దరు అక్రమ సంబంధాన్ని ఆహ్వానిస్తే దానితోపాటు సమస్యలను కూడా ఆహ్వానించినట్లే.