శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 24 సెప్టెంబరు 2014 (20:05 IST)

నేనుండగా హస్త ప్రయోగం చేస్కుంటావా...? విడాకులిస్తానంటోంది...

నేను ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాను. నా భార్య చాలా అందంగానే ఉంటుంది. కానీ ఇటీవలే మా కంపెనీలో మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఎందుకో ఆమెను రోజులో ఒక్కసారైనా ఊహించుకోకుండా ఉండలేకపోతున్నాను. ఈమధ్య నా భార్య పడకగదిలో ఉండగా నేను స్నానాల గదిలో హస్త ప్రయోగం చేసుకున్నాను. ఆ క్షణంలో నాకు పరిచయమైన అమ్మాయిని ఊహించుకుంటూ హస్తప్రయోగం చేసుకున్నాను. 
 
అలా హ.ప్ర చేయడాన్ని నా భార్య చూసింది. ఎందుకు అలా చేస్తున్నావని ప్రశ్నించింది. బెడ్రూంలో నేనుండగా హస్త ప్రయోగం ఎందుకు చేస్తున్నావ్ అని అడిగింది. నీ మనసులో నేను కాక వేరెవరైనా ఉన్నారన్నమాట... ఐతే నేనెందుకు... విడాకులు తీసుకుందాం... అంటూ మండిపడింది. నేను ఆమెను ఎలాగో సముదాయించి శాంతపరిచాను. కానీ ఎంత వద్దనుకున్నా హ.ప్ర అలవాటు మానలేకపోతున్నా... ఎలా...?
 
హస్త ప్రయోగం అనేది యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి అబ్బాయిలు, అమ్మాయిల్లోనూ ఉంటుంది. తమకు నచ్చిన వారిని ఊహించుకుంటూ చేస్తుంటారు. ఇలా చేయడం అనారోగ్యమేమీ కానప్పటికీ భార్యతో సెక్సులో పాల్గొనకుండా కేవలం హస్త ప్రయోగం చేస్తూ కాలం గడిపుతుంటే ఆమెకు ఖచ్చితంగా కోపం వస్తుంది. తన సెక్స్ వాంఛను తీర్చకుండా అలా హ.ప్రతో తృప్తి చెంది రాత్రిపూట పడక సుఖాన్ని దూరం చేస్తే మానసికంగా కూడా చికాకును అనుభవిస్తారు. 
 
పైగా తను కావాలనుకున్న సుఖాన్ని ఇవ్వకుండా ఇలా హస్తప్రయోగం చేస్కుంటూ ఉంటే స్త్రీకి కోపం రావడం సహజమే. మీరు మరో అమ్మాయి పట్ల ఆకర్షితులవ్వడం జరిగినప్పటికీ దాని నుంచి బయటపడేందుకు భార్యతో ఓ వారం రోజులు ఎక్కడికైనా విహార యాత్రకు వెళ్లండి. దాంతో భార్యతో సాన్నిహిత్యం పెరిగి ముందటి ఆలోచనలకు బ్రేకులు పడతాయి.