బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 29 సెప్టెంబరు 2014 (16:10 IST)

'ఐ వాంట్ యువర్ లిప్స్' అన్నాను... ఆమె 'కంట్రోల్' అంది... కానీ లండన్ రమ్మంటోంది

అందమైన ఆమెను చూసి నేను చిత్తయిపోయాను. ఆమె నా భార్య పెద్దమ్మ కూతురు. పెళ్లయి లండన్ లో ఉంటోంది. ఈమధ్య ఓసారి నా భార్య ఆమెతో ఫేస్ బుక్ లో చాటింగ్ చేస్తుంటే నేను కూడా చూశాను. నా భార్య ఆమెతో పరిచయం చేసింది. ఫేస్ బుక్ లో ఆమె ఫేస్ చూడగానే ఆమె పట్ల ఆకర్షితుడనయ్యాను. దాంతో వీలున్నప్పుడల్లా ఆమెతో చాటింగ్ చేయడం మొదలుపెట్టాను. 
 
ఇటీవల స్కైప్ ద్వారా ఆమెతో వీడియోలో మాట్లాడాలని ఉందని అంటే, ఓకే చెప్పింది. ఆ రోజు ఆమెతో సుమారు గంటపాటు మాట్లాడాను. ఇద్దరం వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నాం. ఆమె పొద్దుపోయిందంటూ బై చెప్పేసింది. కానీ మరుసటి రోజు ఆమెతో మాట్లాడేవరకూ ఉండలేక ఫోన్ చేశాను. ఫోనులో... ఆమె అందాన్ని వర్ణించాను. ఒక్కసారి ముద్దుపెట్టుకోవాలని ఉందనీ, ఐ వాంట్ యువర్ బ్యూటిఫుల్ లిప్స్ అంటూ చెప్పాను. 
 
ఆమె కంట్రోల్ అంది. కాదు... నువ్విక్కడికి వస్తే 5 రోజులు నిన్ను కిడ్నాప్ చేసి గడపాలనుందని అన్నాను. నువ్విక్కడికి వస్తావా... నన్నే లండన్ రమ్మంటావా అని అడిగాను. నువ్వే లండన్ రావడం బెటర్ అని ఫోన్ పెట్టేసింది. ఆమెకు నాతో సెక్స్ ఇష్టమా... లేదంటే అక్కడికెళితే పట్టిస్తుందా...?
 
ఇటీవల చాలామంది పురుషులు ఇలా పక్కచూపులు చూడటం జరుగుతూ ఉంది. ఫేస్ బుక్, ట్విట్టర్ వచ్చిన దగ్గర్నుంచి వ్యక్తిగత విషయాలను పరస్పరం షేర్ చేసుకోవడం... కుశల ప్రశ్నలు దాటి సెక్స్ ప్రశ్నల వరకూ వెళ్లిపోతోంది. ఇలాంటి ధోరణి వల్లనే వావివరుసలు, పెద్దచిన్నా అన్నీ మరిచి స్త్రీ పరిచయమైతే సెక్స్ వద్దకు వెళ్లిపోతున్నారు. ఈ ధోరణి తప్పు. 
 
పైగా ఆమె కుటుంబ సభ్యునిగా మీతో మాట్లాడుతుంటే... మీరు ఆమెను అంగాంగ వర్ణన చేస్తూ సెక్స్ కావాలని నిస్సిగ్గుగా అడిగేశారు. ఆమె కంట్రోల్ అనే మాట అన్నప్పుడే మీరు అదుపులో ఉండాలని అర్థం. ఇంకా లండన్ రమ్మని అంటే... సెక్స్ కోసం కాదు... అక్కడ మీకు కౌన్సిలింగ్ ఇప్పించేందుకేనని గుర్తించండి.