శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Updated : గురువారం, 31 మే 2018 (21:09 IST)

పెళ్లయింది... సెక్స్ చేయకుండా నన్ను హస్త ప్రయోగం చేయమంటున్నాడు...?

మాది పెద్దలు కుదిర్చిన వివాహం. మావారు నన్ను కట్నం తీసుకోకుండా నేను చాలా అందంగా ఉంటానని మరీ పెళ్లి చేసుకున్నారు. ఐతే ఆయనలో వింత ప్రవర్తన కనబడుతోంది. రాత్రిపూట పడక గదికి చేరగానే పురుషాంగాన్ని ప్రేరేపించమంటాడు. పురుషాంగం బాగా స్తంభించాక సెక్స్ చేయమంటే చేయడు. పురుషాంగాన్ని నా చేతితో బాగా ప్రేరేపించిన తర్వాత వీర్యం స్ఖలించి తృప్తిగా ఉందని నిద్రపోతాడు. ఎప్పుడో నెలకు ఒకటిరెండుసార్లు తప్ప మిగిలిన రోజులన్నీ ఇలాగే జరుగుతోంది. అదేమని అడిగితే తనకు హస్త ప్రయోగం అలవాటు ఉండేదట. ఆ అలవాటే ఇప్పుడు కూడా బావుంటుందోని అంటున్నాడు. అతడిని మార్చేదెలా...?
 
హస్త ప్రయోగం అలవాటు పురుషులు, స్త్రీలు ఇరువురిలోనూ ఉండటం సహజమైనదే. ఐతే అది సెక్స్ కోర్కెలు తారాస్థాయిలో ఉన్నప్పుడు, పెళ్లయినవారు కూడా తమ భాగస్వామి దూరంగా ఉన్నప్పుడు చేసుకుంటుంటారు. మీవారి విషయంలో మీ చేతి ద్వారా పురుషాంగపై స్పర్శ అతడిలో సెక్స్ ఉద్రేకాన్ని తారాస్థాయికి తీసుకెళుతున్నట్లు తెలుస్తోంది. 
 
ఆ స్థితిలో అతడు సెక్స్ కంటే ఆ పద్ధతిలోనే తృప్తిని అనుభవిస్తున్నాడు. ఐతే ఇలాంటివారిని సెక్సులో పాల్గొనేట్లు చేయాలంటే స్త్రీ యాక్టివ్ పార్ట్ తీసుకోవాలి. అతడు సెక్సుకు ఉపక్రమించడు కనుక స్త్రీయే అతడు కింద ఉండగా స్త్రీ పైన ఉన్న భంగిమలో సెక్సుకు ఉపక్రమించాలి. అలా అతడితో సెక్సులో పాల్గొనడం ద్వారా అతడిలో లైంగిక ఉద్రేకం అధికమై హస్త ప్రయోగం కంటే ఎక్కువ తృప్తిని అనుభవిస్తాడు.