గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 12 నవంబరు 2014 (15:23 IST)

నా బోయ్ ఫ్రెండ్ ఫోన్ సెక్స్ చేస్తున్నాడు... అక్కడ విపరీతంగా...

తరచూ నా బోయ్ ఫ్రెండ్ నాతో ఫోన్ సెక్స్ చేస్తుంటాడు. ఫోనులోనే సెక్స్ పరంగా ఉద్రేకం చెందే విధంగా అతడి సంభాషణ ఉంటుంది. అలా అతడు మాట్లాడుతుండగానే యోని వద్ద ద్రవాలు స్రవించడం జరుగుతోంది. ఈమధ్య ఇది మరీ విపరీతంగా ఉంటోంది. ఆ సమయంలో అతడితో సెక్సులో పాల్గొనాలని ఉన్నా.... దానికి దూరంగానే ఉన్నాము. కానీ అతడి ఫోన్ సెక్స్ వల్ల నా ఆరోగ్యం ఏమయినా పాడవుతుందేమోనని భయంగా ఉంది...
 
సెక్స్ సంభాషణ అనేది నేరుగా లేదంటే ఫోనులో అయినా స్త్రీపురుషులు సెక్స్ పరంగా స్పందించడం సహజమే. ఆ సమయంలో ఇరువురిలోనూ లైంగిక అవయవాలు స్పందిస్తాయి. స్రవాలు విడుదలవుతాయి. స్త్రీ విషయానికి వచ్చేసరికి యుక్త వయసులో ఉన్న స్త్రీ సెక్స్ పరంగా ఉద్రిక్త చెందినపుడు యోని నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ కారణంగా స్రవాల విడుదల ఎక్కువగానే ఉంటుంది. ఐతే ఇది బిడ్డ తల్లుల్లో కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ యువతుల్లో ఇది అధికంగా ఉంటుంది. కాబట్టి దీని గురించి భయపడాల్సిన పనిలేదు.