శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శనివారం, 15 నవంబరు 2014 (20:06 IST)

స్ట్రోక్స్ ఇస్తే ఆమె తీయగా మూలుగుతుందట... నా గర్ల్ ఫ్రెండ్ అలా చేయడం లేదు...

నేను త్వరలో నా గర్ల్ ఫ్రెండును వివాహం చేసుకోబోతున్నాను. ఐతే ఇద్దరం ఇప్పటికి రెండుసార్లు సెక్సులో పాల్గొన్నాం. ఈ విషయం నా స్నేహితుడితో చెబితే... అతడి సెక్స్ అనుభవం చెప్పాడు. అతడు తన భాగస్వామితో సెక్సులో పాల్గొన్నప్పుడు ఆమె తీయగా మూలుగుతుందట. అప్పుడప్పుడు కేకలు కూడా వేస్తుందట. కానీ నా గర్ల్ ఫ్రెండ్ చిన్న శబ్దం కూడా చేయట్లేదు. సెక్స్ చేసినంత సేపు అలా చూస్తూ ఉంటుంది తప్ప ఎలా ఉందో చెప్పదు. ఆమె సెక్స్ పరంగా తృప్తి చెందటం లేదా... లేక నాలోని సెక్స్ సామర్థ్యం లేదా...?
 
పెళ్లి కాక మునుపు సెక్సులో పాల్గొంటే ఇలాంటి అనుమానాలు, అపోహలు వస్తుంటాయి. పెళ్లవక ముందు పాల్గొనే సెక్సులో భయం, ఆందోళన ఉంటుంది. ఇరువురు కూడా సంపూర్ణంగా ఆ అనుభవాన్ని చవిచూడలేరు. మీ స్నేహితుని విషయం వేరు. అతడికి పెళ్లయింది. కనుక వారు స్వేచ్ఛగా ఎలాంటి భయం, ఆందోళనలు లేకుండా సెక్సులో పాల్గొనడం వల్ల అలాంటి అనుభవాలు వారికి కలుగుతున్నాయి. సెక్సులో తారాస్థాయికి వెళ్లినప్పుడు కొన్ని జంటల్లో ఇలాంటి చిన్నచిన్న అరుపులు సహజమే.