బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 20 నవంబరు 2014 (15:36 IST)

పురుషాంగానికి వేసుకున్న కండోమ్ జారిపోతోంది... ఆమె తిడుతోంది...

మా ఇద్దరికి పెళ్లి కాలేదు. గర్ల్ ఫ్రెండును సెక్స్ కోసం ఒప్పించిన తర్వాత ఇపుడు నా పరువు పోతోంది. కండోమ్ ధరించి సెక్స్ చేస్తుంటే అది కాస్తా జారిపోతోంది. ఎంత ప్రయత్నించినా అంగ ప్రవేశం జరగడంలేదు. ఎన్నిసార్లు కండోమ్ వేసుకున్నా తీరా యోనిలో ప్రవేశపెట్టే ముందు జారిపోతోంది. నా అంగం సైజు పొడవు 4.5 అంగుళాలు స్తంభించినప్పుడు ఉంటోంది. అలాగే ఓ అంగుళం వ్యాసంతో ఉంది. ఈ అంగాన్ని కండోమ్ ఎందుకు పట్టి ఉంచలేకపోతోంది. నా అంగం చిన్నదా... నా గర్ల్ ఫ్రెండ్ కండోమ్ తో ప్రయత్నిస్తుంటే తిడుతోంది...
 
 
సెక్స్ సమయంలో స్తంభించిన అంగం షుమారు 5 నుంచి 7 అంగుళాల మధ్య పొడవు కలిగి ఉంటుంది. ఇది సాధారణమైన పొడవు. ఐతే కొందరిలో ఈ పొడవు అధికంగాను ఉంటుంది. అలాగే తక్కువగానూ ఉంటుంది. ఇలా తక్కువగా ఉన్నప్పుడే కొన్ని బ్రాండులకు చెందిన కండోమ్స్ సరిపోలవు. దాంతో పైన మీరు పేర్కొన్నటువంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల స్నగ్ ఫిట్ కండోమ్స్ వంటి రకాలను వాడితే ఫలితముంటుంది. ఐతే పురుషాంగపు సైజులను కొలిచేటపుడు పురుషాంగపు ముందుభాగం నుంచి కొలిచారో లేదో చెక్ చేసుకోండి.