శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శనివారం, 22 నవంబరు 2014 (18:55 IST)

అతడికి న్యూడ్ సెల్ఫీలు కావాలట... పిచ్చి ముదిరిందా...

ఇద్దరం ఉద్యోగాల్లో స్థిరపడ్డాము. పెద్దవాళ్లు మా పెళ్లి గురించి ఇంకా మాట్లాడుకోలేదు. కానీ మేము గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. పెళ్లికి ముందు ప్రేమికులకు ఉండే అనుభవాలే మాకూ ఉన్నాయి. కాకపోతే ఈమధ్య నా బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన కనబరుస్తున్నాడు. గదిలో ఇద్దరం ముద్దులు, కౌగలింతల సమయంలో నగ్న సెల్ఫీలు కావాలని పట్టుబడుతున్నాడు. 
 
మరీ బతిమాలితే ఒకే ఒక్కసారి దానికి అనుమతించా. ఎలాగూ పెళ్లాడబోతున్నాము కనుక దాపరికం ఎందుకని గొడవ చేస్తే అది కూడా ఒప్పుకున్నాను. ఇప్పుడు వచ్చిన ప్రతిసారీ రకరకాలుగా నగ్న సెల్ఫీలు కావాలని గోల పెడుతున్నాడు. ఇతడు మానసికంగా అలాంటి సెల్ఫీల పిచ్చితో అలా ప్రవర్తిస్తున్నాడా...? పెళ్లయ్యాక ఇతడితో సంతోషంగా ఉండగలనా...?
 
ఈ సెల్ఫీల వేలంవెర్రి ఈమధ్య కాలంలోనే వచ్చింది. మోడ్రన్ భావాలనే పేరుతో ఇలాంటి పనులు చేస్తున్నారు కొందరు. అవి కేవలం మరో వ్యక్తికి ఇబ్బంది కలిగించనంత వరకూ ఫర్వాలేదు కానీ... ఇలా నగ్న సెల్ఫీలు అంటూ వేధించడం అసహజం. పెళ్లయ్యాక గదిలో జంట నగ్నత్వాన్ని ఆస్వాదించాల్సిందిపోయి ఇప్పుడే అలాంటి ప్రవర్తన ఇబ్బందికరమే. దానిని అలాగే వదిలేస్తే పొరబాటున అవి ఎక్కడైనా లీక్ అయితే వ్యక్తిగత జీవితం బజారుపాలవుతుంది. కాబట్టి తక్షణం ఆ అలవాటును మానుకోమని నచ్చజెప్పండి.