గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 24 నవంబరు 2014 (14:34 IST)

బాత్రూంకి వెళుతుండగా టవల్ జారిపోయింది... పక్కింటమ్మాయి టీజ్ చేస్తోంది..

నా వయసు 22 ఏళ్లు. ఇటీవల స్నానం చేద్దామని టవల్ కట్టుకుని బాత్రూంకి వెళుతుండగా గబుక్కున టవల్ జారిపోయింది. దాంతో నగ్నంగా మారిపోయాను. కింద పడిన టవల్ తీసుకునే లోపే పక్కింటి అమ్మాయి అంతా చూసేసింది. ఇక అప్పట్నుంచి నన్ను ఆట పట్టిస్తోంది. ముఖ్యంగా పురుషాంగంకు సంబంధించి ఓ విధమైన జోక్ చేస్తోంది. ఏం చేయాలో అర్థం కావడంలేదు. 
 
మగాళ్లకు ధైర్యం ఎక్కువ అని అంటుంటారు కదా. మరి నేనెందుకు విపరీతంగా సిగ్గుపడిపోతున్నానో అర్థం కావడంలేదు. ఆమె చూస్తుందేమోనని ఇప్పుడు షార్ట్ వేసుకుని వెళుతున్నాను. ఆ అమ్మాయి మాత్రం నాపై కామెంట్లు ఆపడంలేదు. నేనలా నగ్నంగా మారిపోయినప్పుడు ఆమె నా ఫోటో ఏమైనా తీసిందేమోనన్న అనుమానం కూడా వస్తోంది. ఆ విషయాన్ని ఆమెను అడిగుదామంటే చేతులు కాళ్లు వణుకుతున్నాయి. ఎందుకిలా అయిపోతున్నాను...?
 
బహిరంగంగా నగ్నంగా ఇతరులకు కనబడటం అనేది ఎవరికైనా సిగ్గును కలిగించే అంశమే. మగవారు కానీ ఆడవారు కానీ ఎవరికైనా ఇలా హఠాత్తుగా జరిగినప్పుడు షాక్ తింటుంటారు. అదే మీ విషయంలోనూ జరిగింది. యుక్తవయస్సు వచ్చాక ఇలా నగ్నంగా పక్కింటి అమ్మాయికి కనబడేసరికి తెలియని ఆందోళన కలుగుతుంది. ఇకపోతే పక్కింటి అమ్మాయి ఆ సంఘటన గురించి పదేపదే ప్రస్తావించడం చూస్తుంటే మీకు ఆమెకు కాస్త చనువు ఉన్నట్లు అర్థమవుతుంది. ఇకపోతే ఆమె మీ నగ్న ఫోటోను తీసిందేమోనని అనుమానం ఉంటే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావించండి. మీరు సిగ్గుపడేకొద్దీ ఆమె ఇలా ఆట పట్టిస్తూనే ఉంటుంది.