గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 24 నవంబరు 2014 (19:45 IST)

ఫారిన్ నుంచి వచ్చి అంగ ప్రవేశం చేశా.... సెక్స్ పవర్ లేదంటోంది... ఆమెకెలా తెలిసింది...?

పెళ్లయిన వెంటనే నేను ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లాల్సి వచ్చింది. 6 నెలలు ఆగి తిరిగి వచ్చాను. ఆరోజు రాత్రి శోభనం ఏర్పాట్లు చేశారు. అంగ ప్రవేశం చేశాను. 2 నిమిషాల్లో వీర్యం స్ఖలనమైపోయింది. ఆ తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా అంగం మెత్తబడే ఉంది. దాదాపు 4 గంటలు ప్రయత్నించా. అంగం స్తంభించలేదు. నా భార్య కూడా ఎంతగానో ప్రేరేపించింది. నేను చేయలేకపోయాను. 
 
రెండో రోజు కూడా అదే అనుభవం ఎదురైంది. మూడో రోజు చేయబోతుంటే... నీకు సెక్స్ పవర్ లేదు... ఎందుకు కష్టపడతావ్ అంటూ ఆమె ప్రశ్నించింది. ఆమె ప్రశ్నలకు నేను షాక్ తిన్నాను. అసలు నాకు సెక్స్ పవర్ లేదని ఆమెకు ఎలా తెలిసింది... ఆమె ఇంతకుముందే సెక్స్ అనుభవం చవిచూసిందేమోనని అనుమానంగా ఉంది...
 
సుదీర్ఘ కాలం పాటు భార్యకు దూరంగా ఉండేవారు ఇలాంటి అనుమానాలను రేకెత్తించి సంసారాన్ని సమస్యలపాలు చేసుకుంటారు. మీ ఆలోచన, భయం అర్థంలేనివి. అంగం స్తంభించకుండా మెత్తబడిపోతుంటే అలా మాట్లాడకుండా ఎలా మాట్లాడుతారు. ముఖ్యంగా మీలో అంగ స్తంభన వైఫల్యం ఎందుకు చోటుచేసుకుంటుందో టెస్ట్ చేయించుకోండి. తొలిరోజు ఆదుర్దాతో అయిందనుకున్నా ఆ తర్వాత కూడా అలాగే అవుతుందంటే ఏదైనా సమస్య ఉందేమో చెక్ చేయించుకోండి. అనవసరంగా భార్యపై అపోహలు పెంచుకోవద్దు.