శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: మంగళవారం, 25 నవంబరు 2014 (15:02 IST)

నా భర్త పిన్ని కొడుకు... నా నాభీని రెండుసార్లు తాకాడు... అతడి ఉద్దేశం...?

నా భర్త తరపు బంధువులు ఎక్కువ. ఈమధ్య ఆయన పిన్ని కొడుకును తీసుకొచ్చాడు. ఇద్దరికీ కాఫీ కలిపి ఇస్తున్న సమయంలో అతడు తన వేళ్లను నా నాభికి తాకించాడు. ఆ తర్వాత కూడా పదేపదే నాభి వైపు చూస్తూ ఉన్నాడు. అతడి చూపుల్లో ఏదో తేడా ఉందని అనిపిస్తోంది. ఈ విషయం నా భర్తకు చెబితే అనవసరంగా రాద్దాంతం చేసినట్లవుతుందేమోనని అనుకుంటున్నా. అసలు అతడు ఎందుకలా చూస్తున్నాడు...?
 
అతడి ప్రవర్తన మీ పట్ల అనుచితమైనదే. ఐనప్పటికీ పరాయి వ్యక్తులు ఇంట్లోకి వస్తున్నప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు భర్త ముందు వస్త్ర ధారణ మీ ఇష్టం వచ్చినట్లు ధరించవచ్చు కానీ... పరాయి వ్యక్తులు వస్తున్నప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి. ఏదేమైనప్పటికీ మీ జాగ్రత్తలో మీరు ఉండక తప్పదు. అతడు మీ ఇంట్లో మరిన్ని రోజులు తిష్ట వేసేట్లు ఉంటే సున్నితంగానే మీ భర్తతో చెప్పి అతడిని పంపించే ప్రయత్నం చేయండి.