శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శనివారం, 13 డిశెంబరు 2014 (19:31 IST)

నా గర్ల్ ఫ్రెండును తాకినపుడల్లా పురుషాంగం నుంచి ద్రవం వస్తోంది... ఇదేమైనా జబ్బా...?

కాలేజీలో చదువుతున్నాను. నా క్లాసులో ఓ అమ్మాయి నాకు చాలా క్లోజ్ గా ఉంటోంది. ఇటీవల ఇద్దరం డౌట్స్ క్లియర్ చేసుకుంటుండగా ఆమె శరీరాన్ని నాకు తాకించింది. వక్షోజాలు నా చేతికి తగిలాయి. వెంటనే నా అంగం స్తంభించింది. కొద్దిసేపటికి ఏదో ద్రవం వస్తున్నట్లనిపించింది. ఆ ఫీలింగ్ కొద్దిసేపు అలాగే ఉంది. ఆ తర్వాత ఇంటికి వచ్చేశాను. ఇలా ఎప్పుడు ఆమె శరీరాన్ని తాకించినా ఇదే జరుగుతోంది. అంగం స్తంభిస్తూ ద్రవం వస్తోంది. నాకేదో భయంగా ఉంది. ఇదేమైనా జబ్బేమోనని అనుమానంగా ఉంది....
 
యవ్వనంలో అమ్మాయి సెక్సీ భాగాలు తగిలినపుడు ఇలాంటి అనుభవం కలుగడం సహజమే. ఆమె వక్షోజాలు తగలగానే అంగం స్తంభించి దాని నుంచి ద్రవం రావడంపై ఆందోళన చెందనక్కర్లేదు. సెక్సు పరంగా ఉద్రిక్త చెందినపుడు ఇలాంటి అనుభవం కలుగుతుంది. ఇది అబ్బాయిల్లోనే కాదు... అమ్మాయిల్లోనూ కలుగుతుంది. ఐతే.... మీరు మరీ అంతగా పక్కపక్కనే కూర్చుని ఇలాగే కొనసాగితే ఈ సెక్సీ భావాలు అధికమవుతాయి కనుక ఆమెకు కాస్త దూరంగా కూర్చుని డౌట్స్ క్లియర్ చేసుకోండి.