శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: మంగళవారం, 16 డిశెంబరు 2014 (13:32 IST)

ఆమె వక్షోజాలు చూషించా.... ఐనా సెక్స్‌కు స్పందించడంలేదేమిటి...?

ఆమె చాలా సెక్సీగా ఉంటుంది. ఆమెతో జీవితం నాకు స్వర్గం చూపిస్తుందనుకున్నా. అందుకే ఆమె ప్రేమ కోసం పాకులాడి దక్కించుకున్నాను. ఆమె నా ప్రేయసి. త్వరలో ఇద్దరం పెళ్లిచేసుకోబోతున్నాం. ఈమధ్య ఇద్దరికీ ఏకాంతం దొరికింది. మా ఇంటికి వచ్చినపుడు ఎవరూ లేకపోవడంతో ఆమెను కౌగలించుకున్నాను. ఆమె పరవశించింది. ఆ తర్వాత వక్షోజాలను చూషించాను. కానీ ఆమెలో ఎలాంటి స్పందన లేదు. అలా చూస్తూ ఉండిపోయింది తప్ప సెక్స్ పరంగా స్పందించలేదు. ఆమె భావాలు చూసి నేను కూడా మూడాఫ్ అయ్యాను. పెళ్లయ్యాక కూడా ఇంతేనా...?
 
భారీ స్తనాలు అంటే, సి, డి, కప్ సైజు స్తనాలు కలిగినవారిలో చనుమొనలు స్పృశించినా అంతగా సెక్స్ కు స్పందించవని కొందరు చెపుతుంటారు. స్తనాల సైజు భారీగా తయారవటంలో చర్మం బాగా సాగిపోయినందువల్ల కొన్ని నాడీతంత్రులు దెబ్బతిని సున్నితత్వాన్ని కోల్పోతాయన్నది తేలిన అంశం. కానీ భారీ స్తనాలలో పైభాగం బాగా సున్నితంగా ఉంటుంది. 
 
చనుమొనలు కాకుండా అక్కడ స్పృశిస్తే ఆమె సెక్సుపరంగా ఉద్రేకాన్ని పొందుతుంది. అంతేకాకుండా స్తనాలను తాకితే సెక్సు పరంగా ఉద్రేకం తెప్పించగలిగే లోషన్లు కూడా ఉన్నాయి. వాటిని వాడినా ఫలితం ఉంటుంది. ఐతే వాటి వాడకం ఆయా స్త్రీలు ఇష్టపడితేనే వాడాలి. 
 
ఇకపోతే స్తనాలపై స్పర్శించగానే సెక్సుకు స్పందించడంలేదన్న బెంగను వదిలేసి ఆమె శరీరంలో మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడెక్కడ స్పృశిస్తే శరీరం సెక్సుపరంగా పరవశిస్తుందే కనుగొని ఆ ప్రకారం నడుచుకోవచ్చు. అంతేతప్ప చనుమొనలు సెక్స్ ఉద్దీపనలు గురించి తీవ్రంగా ఆలోచించకూడదు. ఆ సమయంలో స్త్రీ మానసిక స్థితిపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. పైగా మీరు పెళ్లి కాకుండానే ఆమెతో శృంగారం చేయాలని ప్రయత్నించారు. ఆ భయం వల్ల కూడా ఆమెలో ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఉండి ఉండవచ్చు.