బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 18 డిశెంబరు 2014 (19:38 IST)

సెక్స్ చేసుకుందామని ఆన్‌లైన్‌లో పిలిచింది... వెళితే భుజంపై కొరికింది....

నా ఈ అనుభవాన్ని ఎవరికైనా చెప్పాలంటేనే సిగ్గుతో చచ్చిపోతున్నా. ఈమధ్య నగరంలో నాకు ఉద్యోగం వచ్చింది. నా గదిలో నేనొక్కడినే. ఆన్ లైన్ లో సైట్లు చూస్తుంటాను. అలా చూస్తున్న సమయంలో ఓ అందమైన అమ్మాయి పరిచయమైంది. ఆన్ లైన్ ద్వారా మాటలు కలుపుతూ ఇద్దరం సెక్స్ చేసుకుందామని పిలిచింది. చేతి నిండా డబ్బు ఉండటంతో వెళ్లాను. 
 
ముద్దులు, కౌగిళ్లు సమయంలో అంగం బాగా స్తంభించడంతో సెక్స్ చేయబోయాను. ఆమె నా భుజంపై గట్టిగా కొరికింది. దాంతో నాకు ప్రాణం పోయినంత పనైంది. అదేమని అడిగితే తనకు మూడ్ వస్తే అలానే చేస్తానంది. తీవ్రమైన నొప్పి పెడుతుండటంతో సెక్స్ కోరిక అప్పటికి చచ్చిపోయింది. దాంతో మరో వారంలో చేసుకుందామని నా వద్ద ఉన్న డబ్బు తీసుకుంది. వారం తర్వాత ఫోన్ చేస్తే ఆ నెంబరు పనిచేయడంలేదు. నా భుజంపై ఆమె కొరికిన గాయం కొద్దిగా మానింది కానీ దానివల్ల ప్రమాదమేమైనా కలుగుతుందేమోనని భయంగా ఉంది...
 
అపరిచత వ్యక్తులతో అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఇలాంటి సంబంధాలను పెట్టుకోరాదు. ఆన్ లైన్ లో ఇలాంటి మోసాలు ఎక్కువని ఎన్నోసార్లు చూస్తూనే ఉంటాం. ఐనా కొందరు ఇలాంటి ఉత్సాహం చూపిస్తే ఇలాంటి సమస్యలే వస్తుంటాయి. ఆమె కొరకడం వల్ల సెప్టిక్ అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి ముందు వైద్యుడి సూచన మేరకు చికిత్స చేయించుకోండి. ఇకపై అటువంటి కోరికలకు మనసులో తావు ఇవ్వవద్దు. ఉద్యోగం వచ్చింది కనుక తగిన అమ్మాయిని చూసి వివాహమాడండి.