గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శుక్రవారం, 2 జనవరి 2015 (14:46 IST)

ఆమె భర్త విదేశాల్లో ఉన్నాడు.... సెక్స్ కోసం నన్ను అడగదేమిటి...?

నేనో సాఫ్టే వేర్ ఇంజినీర్‌ను. నగరంలో ఓ పెద్ద కంపెనీలో చేస్తున్నాను. నాతోపాటు మరో 10 మంది కూడా చేస్తున్నారు. వారితో నాకు ఫ్రెండ్ షిప్ ఉంది. వీరిలో ఓ అమ్మాయికి పెళ్లయి ఏడాదిన్నర దాటింది. ఆమె భర్త ఉద్యోగరీత్యా విదేశాల్లో పనిచేస్తున్నారు. ఆమెను చూస్తే నాకు సెక్స్ కోర్కెలు కలుగుతాయి. ఏడాది నుంచి ఆమెను సెక్స్ చేసుకుందామని అడగాలని చూస్తూనే ఉన్నాను. 
 
ఆమె తమ కుటుంబ విషయాలు, ఇతరత్రా విషయాలు చెపుతుంది కానీ సెక్సుకు సంబంధినవి మాట్లాడదు. ఒకవేళ నేను పరోక్షంగా అలాంటి చర్చ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే మెల్లగా అక్కడ నుంచి వెళ్లిపోతుంది. నాకు ఆమెపై అంతగా సెక్స్ కోర్కె కలుగుతుంటే ఆమెకు ఎందుకు కలుగడం లేదు. సెక్స్ కావాలని నన్ను ఎందుకు అడగడం లేదు... ఏడాదిన్నరగా భర్త దూరంగా ఉన్నా ఆమె అంత దృఢంగా ఎలా ఉండగలుగుతుంది...?
 
ఈ సందేహాలన్నీ మీకు అవసరంలేదు. పెళ్లి బంధంతో యువతీయువకులు ఒకటైపోతారు. ఇకపోతే మీరు ఆమె భర్తతో సెక్స్ అనుభవించడంలేదని అంటున్నారు. కానీ ఇటీవల శాస్త్రసాంకేతికాభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతూ, అవన్నీ మీకు తెలిసి కూడా ఇలా అనుకోవడం అవివేకమే. తన భర్తతో ఫోన్ లో మాట్లాడుకోవచ్చు. స్కైప్ ద్వారా చాలా దగ్గరగా వారు తమతమ ప్రేమాప్యాయతలను పంచుకోవచ్చు. 
 
ఇంకా ఎన్నో సాధనాలు భార్యాభర్తలు దూరంగా ఉన్నప్పటికీ దగ్గర చేస్తున్నాయి. కాకపోతే వారిమధ్య భౌతిక సుఖం లేకపోయినప్పటికీ వారి మధ్య ఎడబాటు అనేది తెలియకుండా గడిచిపోతున్నట్లు చాలామంది చెపుతున్నారు కూడా. ఒకవేళ ఇలాంటి సాధనాలేమీ లేకపోయినా పెళ్లయిన స్త్రీ తన భర్త తోటిదే లోకంగా గడుపుతుంది. కాబట్టి ఆమె పట్ల మీరు చేస్తున్న ఆలోచనలను తుడిపేసి, మరో అమ్మాయిని చూసి వివాహం చేసుకోండి.