గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 19 జనవరి 2015 (14:56 IST)

బాయ్ ఫ్రెండ్‌ సెక్స్ కావాలంటున్నాడు... గర్భం రాకుండా పాల్గొనాలని...

మేము వచ్చే ఏడాది పెళ్లాడబోతున్నాం. కానీ అంతవరకూ సెక్స్ చేయకుండా ఉండలేనని నా బోయ్ ఫ్రెండ్ అంటున్నాడు. ఒక్కసారి సెక్సులో పాల్గొందామని అడుగుతున్నాడు. ఇప్పటికే చాలాసార్లు కాదన్నాను కానీ ఇక కాదనలేని పరిస్థితి. సెక్సులో పాల్గొన్నా గర్భం రాకుండా ఉండే పద్ధతులు ఏమిటి...?
 
కండోమ్ సక్రమంగా వాడితే క్షేమమే. అంగప్రవేశానికి ముందు కండోమ్ ధరించాలి. ఒకవేళ కండోమ్ చిరిగిపోతే తర్వాత తీసుకోవాల్సిన అత్యవసర గర్భ నిరోధక చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. దీనిలో హార్మోన్ల మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది. 
 
ఈ మాత్రలను మొదటి డోస్ సెక్సులో పాల్గొన్న 72 గంటల లోపు తీసుకోవాలి. తొలి డోసు తీసుకున్న 12 గంటలకు రెండవ డోసు తీసుకోవాలి. సెక్సులో పాల్గొన్న తర్వాత ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా డోస్ తీసుకోవడం మంచిది. 
 
ఇలా తీసుకోవడం వల్ల అండం విడుదల, ఫలదీకరణ వంటివి నిరోధించబడతాయి. ఫలదీకరణం చెందినా ఆ బీజాన్ని స్థిరపడకుండా చేస్తాయి. ఈ మాత్రలలో వైఫల్య శాతం 2 నుండి 3 శాతం మాత్రమే. సెక్సులో సుఖం పొందాలంటే మానసికంగా ఏ అలజడి ఉండకూడదు. ఐతే పెళ్లి కాకుండా సెక్స్ సంబంధాలు మంచిది కాదని గమనించండి. ఇన్నేళ్లు ఆగినవారు మరో ఏడాది కాలంపాటు ఆగలేరా... అలా అని కన్విన్స్ చేయండి. పెళ్లయిన తర్వాత దాంపత్య సుఖాన్ని అనుభవించడం ఇద్దరికీ మేలు.