గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: మంగళవారం, 20 జనవరి 2015 (16:27 IST)

నేను అందగత్తెనే కానీ బక్కగా ఉంటాను... వక్షోజాలు చిన్నవి... సెక్స్ కోర్కెని....

నాకు 26 సంవత్సరాలు. అందంగా ఉంటాను. కానీ చాలా బక్కగా ఉంటాను. ఎత్తు కూడా 5 అడుగుల ఐదు అంగుళాలుంటాను. వక్షోజాలు కూడా చిన్నవిగా ఉన్నాయి. ఇవన్నీ చూసుకుని వివాహం పట్ల నాకు విముఖత పెరిగిపోయింది. పెద్ద స్తనాలు, ఎత్తుకు తగిన లావు ఉన్నవారి పట్ల పురుషులు బాగా ఆకర్షణకు లోనవుతారనీ, వారితో శృంగారం బావుంటుందని చాలామంది చెప్పడం ద్వారా విన్నాను. నిజంగా పెద్ద స్తనాలు సెక్స్ కోర్కెను పెంచి దాంపత్య సుఖాన్ని బాగా పెంచుతాయా...?
 
వక్షోజాల పరిమాణం ఆకర్షణీయమైన ఆకారం సెక్స్ సామర్థ్యానికి కొలబద్దలు కానేకావు. ఐతే లైంగిక భాగస్వామిలో పెద్ద సైజు వక్షోజాలు, చక్కని శరీరాకృతి పట్ల అభిరుచి ఉంటే దాని ప్రభావం రతి ప్రక్రియపై పడే అవకాశం ఉంది. ఐతే వక్షోజాలు పెద్దగా ఉన్నవారిలో ఉండే నరాగ్రాల సంఖ్య చిన్నగా ఉండేవారిలోనూ ఉంటాయి. 
 
ఆ ప్రకారంగా చూసినప్పుడు చిన్న వక్షోజాలను కలిగినవారు సెక్స్ పరంగా వెంటనే స్పందిస్తారు. త్వరితంగా కామప్రేరణను పొందగలుగుతారు. ఇకపోతే... బక్క పలుచని వ్యక్తులు దాంపత్య సుఖాన్ని ఆనందించలేరనేది అపోహ మాత్రమే. లైంగిక తృప్తికి, శరీరాకృతికి ఎలాంటి సంబంధం లేనేలేదు.