శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 22 జనవరి 2015 (15:33 IST)

ఇలాగే ప్రేమించుకుందాం... పవిత్రంగా ఉందాం... సెక్స్ మాత్రం వద్దంటోంది... ఎలా...?

నేను గత రెండేళ్లుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమెకు నేనంటే ఎంతో ప్రేమ. ఒక్కరోజు నేను ఫోన్ చేయకపోతే ఇంటికి వచ్చేస్తుంది. ఆమెతో పరిచయం మా ఇంట్లో కూడా తెలుసు. ముందు జాబ్స్ లో సెటిలవ్వండి... పెళ్లి చేసుకుందురు అని మా పేరెంట్స్ చెప్పారు. అందువల్ల ఇద్దరం ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాం. 
 
ఇటీవల ఆమె మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో ఎవరూ లేరు. దాంతో ఆమెతో ఏకాంతంగా స్పెండ్ చేసే టైం దొరికింది. ఒక దశలో సెక్స్ కోర్కె విపరీతమైంది. అంగ ప్రవేశం కోసం ప్రయత్నించా. ఆమె పక్కకు తోసేసింది. నాకు చీవాట్లు పెట్టింది. ప్రేమంటే ఇంతేనా అంటూ మండిపడింది. ఇద్దరం జీవితంలో ఇలాగే ప్రేమించుకుంటూ ఉందామని అంటోంది. పెళ్లయ్యాక కూడా సెక్స్ వద్దని చెప్పేసింది. నిజంగా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అలాగే ప్రవర్తిస్తే ఏమిటి మార్గం...?

 
చాలామంది అమ్మాయిల్లో సెక్స్ అంటే అదో భయంకరమైన అనుభవం అనే అపోహ ఉంది. సెక్సులో పాల్గొన్నప్పుడు రక్తం కారడం వంటి సమస్యలు తలెత్తుతాయని భయపడుతుంటారు. పైగా సెక్స్ గురించి బహిరంగంగా చర్చించుకునే అలవాటు కూడా చాలామందిలో ఉండదు. అందువల్ల సెక్స్ అనగానే తెలియని ఆందోళన కలుగుతోంది. 
 
పైగా పెళ్లికి ముందే సెక్స్ అంటే మరీ బెంబేలెత్తిపోతారు. ఆమెలో గూడుకట్టుకుని ఉన్న అపోహలను తొలగించాలి. సెక్స్ అంటే భయంకరమైన అనుభవం అనేది లేకుండా చేయాలంటే దానికి సంబంధించిన విజ్ఞానాన్ని ఆమెకు వివరించాలి. ఆమెలో పరివర్తన వస్తుంది. కాబట్టి ఆమెను పెళ్లి చేసుకుంటే సెక్స్ చేయలేకుండా పోతానేమోనని అనుమానం వదిలేయండి.