గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శుక్రవారం, 23 జనవరి 2015 (16:30 IST)

ప్రేమించిన అమ్మాయితో శారీరకంగా కలిశా... ఫారిన్ నుంచి వచ్చేసరికి వేరొకరితో...

నేను ఓ అమ్మాయిని ప్రేమించాను. ప్రేమించుకునే సమయంలో ఆమెతో రెండుసార్లు శారీరకంగా కూడా కలిశాను. నేవీలో పనిచేసే నేను పది నెలలపాటు విధిలో భాగంగా వెళ్లాను. నేను తిరిగొచ్చేసరికి ఆమె ఇంగ్లాండు వెళ్లి వచ్చిందనీ, మరెవరినో పెళ్లాడిందని తెలిసింది. ఈ విషయం ఆమె నాకు చెప్పలేదు. ఎవరి ద్వారానో తెలుసుకున్నాను. ఆ అమ్మాయి ఇలా ఎందుకు చేసింది. నా ప్రేమ జీవితం ఇలా మసకబారిపోవడానికి ఆమే కారణం. ఇప్పుడు నాకు మరో అమ్మాయిని పెళ్లాడనిపించడంలేదు.... నేను చేస్తున్నది కరెక్టే కదా...?

 
పెళ్లి చేసుకుంటున్న విషయం ముందుగా మీకు చెప్పి ఉంటే మీరేం చేసేవారు. వెళ్లి ఆ పెళ్లిని ఆపేసే ప్రయత్నం చేసేవారా... ఆ అమ్మాయి ఏవో బలమైన కారణాల వల్ల అలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుంది. మిమ్మల్ని వద్దనుకుని మరో పురుషునికి అర్థాంగి అయిన అమ్మాయి గురించి ఇంకా మీరు ఆలోచించడం అనవసరం. కొన్నిసార్లు కొంతమంది విషయంలో ఇలాంటివి జరుగుతుంటాయి. అంతమాత్రం చేత ఇక లోకంలో ప్రేమే లేదనీ, అమ్మాయిలు మోసగత్తెలను అనడం సమంజసం కాదు. పురుషుల్లో కూడా ఇలా అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నవారు లేరూ....?