శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 28 జనవరి 2015 (16:56 IST)

నా ఫ్రెండ్ భర్త ఆమెతో నగ్నంగా సెక్స్ చేస్తాడట... నేను దుస్తులు విప్పను...

నా స్నేహితురాలు నేను ఎప్పుడు కూడా సెక్స్ గురించిన విషయాలు మాట్లాడుకోము. ఒకవేళ ఆమె అలాంటి ప్రస్తావన తెచ్చినా నేను కట్ చేస్తాను. ఈమధ్య ఆమె చాలా అందంగా తయారైంది. చాలా ఉత్సాహంగా పనిలో కూడా నాకంటే ముందే ఉంటోంది. దాంతో ఆమెకు ఇంక్రిమెంట్ కూడా బాగా వేశారు. కానీ నేను ఎందుకో కళావిహీనంగా మారాను. హుషారు ఉండటంలేదు. నా స్నేహితురాలితో దీనిపై చర్చించాను. ఆమె అందానికి, హుషారుగా ఉండటానికి కారణం సెక్స్ అని అంటోంది. 
 
పైగా ఆమె తన భర్తతో కలిసి ఇద్దరూ నగ్నంగా సెక్స్ చేసుకుంటారట. అలా చేసుకున్న తర్వాత ఇద్దరూ ఎంతో తృప్తిగా నిద్రపోతారట. అందువల్లనే తను అలా అయ్యానని అంటోంది. నేను మాత్రం పడకగదిలో నా భర్త ఎంత బ్రతిమాలినా దుస్తులు మాత్రం విప్పను. నాకు చాలా సిగ్గు. ఆయన కూడా నన్ను వేధించరు. కానీ నా స్నేహితురాలి మాటలు వింటుంటే నగ్నంగా సెక్సులో పాల్గొనాలని ఉంది. కానీ అది తప్పేమో అనిపిస్తోంది...
 
సెక్సులో వీలైనన్ని ప్రయోగాలు చేస్తుండాలి. అది కూడా భార్యాభర్తలు ఇష్టంతోనే జరగాలి. ముఖ్యంగా స్త్రీ దుస్తులు విప్పి భర్త ముందు ఉండాలంటే దానికి ముందుగా ఇద్దరి మధ్య సంభాషణ జరగాలి. ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. సెక్స్ అనేది సిగ్గు, బిడియంతో బిగుసుకుపోతే తృప్తినివ్వదనే విషయాన్ని గ్రహించాలి. ఇద్దరిలోనూ పరస్పర ప్రేమానురాగాలు పొంగినపుడు దుస్తులు విప్పితే సిగ్గు అనే ఆలోచన రానేరాదు. ఇకపోతే తృప్తికరమైన సెక్సులో పాల్గొనడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఎన్నో ప్రయోగాలు నిరూపించాయి. మీ స్నేహితురాలు చెపుతున్న విషయంలో అవాస్తవేమీ లేదు.