గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: మంగళవారం, 10 ఫిబ్రవరి 2015 (17:56 IST)

నా బోయ్ ఫ్రెండ్ నన్ను గర్భవతిని చేశాడు... అమెరికా వెళ్లిపోయాడు....

నా బోయ్ ఫ్రెండ్ వల్ల గర్భం వస్తే మొదటి నెలలోనే అబార్షన్ చేయించుకున్నాను. ఆ తర్వాత అతడు అమెరికా వెళ్లిపోయాడు. అక్కడికెళ్లాక ఫోన్ చేసి తనను మర్చిపొమ్మన్నాడు. ఇంట్లోవాళ్లు నాకు వేరే సంబంధం చూస్తున్నారు. ఇతడితో దాదాపు పెళ్లి నిశ్చయమైపోయింది. నేనిప్పుడు ఇతడిని పెళ్లి చేసుకుంటే నాకు గర్భం వచ్చిన సంగతి అతడు తెలుసుకోగలడా... నాకు అబార్షన్ అయినట్లు తెలుసుకుంటాడా...?

 
మీరు కానీ, లేదంటే మీ బోయ్ ఫ్రెండు కానీ లేదంటే మీకు అబార్షన్ చేసిన డాక్టర్ కానీ చెబితేనే మీకు అలా జరిగిందన్న సంగతి తెలియదు. మీకు మరీ గిల్టీ ఫీలింగ్ కలిగితే మీరే చెప్పేసినా చెప్పేయవచ్చు. అంతేతప్ప ఆ విషయం అతడికి తెలిసే అవకాశం లేదు. మీ బోయ్ ఫ్రెండ్ మర్చిపొమ్మని మాట మార్చాడు కనుక ఇక అతడి విషయాన్ని పూర్తిగా మర్చిపోయి పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని గడపండి.