మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 18 ఫిబ్రవరి 2015 (14:51 IST)

వేశ్యల వద్దకు వెళ్లే అలవాటు మానుకోలేకపోతున్నా... ఎలా...?

నాకు సెక్స్ కోర్కెలు విపరీతంగా వస్తుంటాయి. రోజూ సెక్స్ యావతోనే ఉంటాను. ఇటీవల ఈ కోర్కెలను ఆపుకోలేక వేశ్యల వద్దకు వెళ్లడం మొదలుపెట్టాను. ఈ అలవాటు వల్ల నెల తిరిగేసరికి నా జీతమంతా వారికే ఖర్చయిపోతోంది. అప్పులు పాలయ్యాను. ఐనా అప్పులు చేసి మరీ వెళుతున్నాను. ఈ వ్యసనం ఎలా వదులుతుందో అర్థం కావడంలేదు. ఆ సమయం వచ్చేసరికి వెళ్లిపోతున్నాను. 
 
నాకు పొద్దస్తమానం ఫోనులు కూడా వస్తుంటాయి. ఆఫీసులో వాటిని అటెండ్ చేస్తూ ఉండటంతో పనిపై ఏకాగ్రత పోతోంది. దాంతో రెండుమూడు సార్లు మేనేజ్మెంట్ నుంచి వార్నింగులు కూడా వచ్చాయి. ఉద్యోగం ఊడుతుందేమోనని భయంగా కూడా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు....

సెక్స్ కోర్కెలు కలుగడం సహజమైన పరిణామమే. అంతమాత్రం చేత ఇలా కోర్కెలను తీర్చుకునేందుకు అడ్డదారులు వెతుక్కోవడం అసహజం. సెక్స్ కోర్కెలను అదుపు చేసేందుకు వివిధ మార్గాలున్నాయి. ముఖ్యంగా జీవితంలో లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం చేస్తుంటే ఆ దిశగా ఆలోచనలు వెళతాయి. 
 
ఐనప్పటికీ సెక్స్ కోర్కెను అదుపు చేయలేకపోతే హస్త ప్రయోగంతో కళ్లెం వేయవచ్చు. కాబట్టి ముందుగా మీ ఆలోచన ధోరణిని మార్చుకుని నిగ్రహంతో వ్యవహరించండి. లేదంటే ఉద్యోగం పోవడంతో పాటు తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా వెంటాడే ప్రమాదం ఉంది జాగ్రత్త.