గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శనివారం, 21 ఫిబ్రవరి 2015 (14:11 IST)

అంగ ప్రవేశం చేయబోతే అల్లాడిపోతోంది... ఏడాదిగా వదిలేశా... కానీ ఇప్పుడు...

నాది చిత్రమైన సమస్య అనుకుంటున్నాను. నా భార్యగా చేసుకున్న ఈమెను నాలుగేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఐతే ఆ నాలుగేళ్ల ప్రేమలో కేవలం కౌగలింతలు, ముద్దులు వరకే పరిమితమయ్యాము. కానీ ఆ సమయంలో ఏనాడూ నేను ఆమెతో సెక్స్ వరకూ వెళ్లింది లేదు. ఆమె కూడా నన్ను అడిగింది లేదు. 
 
పెళ్లయ్యాక శోభనం రోజున ఆమెతో సెక్స్ చేసేందుకు ఉపక్రమించబోయాను. అంగాన్ని యోనిలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తే అల్లాడిపోయింది. కన్నీటిపర్యంతమయ్యింది. ఎంతో బాధగా ఉందని ఏడ్చింది. దాంతో ఆ ప్రయత్నాన్ని విరమించాను. గత ఏడాదిగా అప్పుడప్పుడు అంగ ప్రవేశం చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. 
 
కానీ అది సాధ్యం కావడంలేదు. ఇటీవల అసలు సెక్స్ అవసరమా.. అనే ప్రశ్న వేస్తోంది నా భార్య. ఇంకా ప్రెగ్నెంట్ వార్త చెప్పలేదేమిటని నా పేరెంట్స్ అడుగుతున్నారు. ఈమధ్య ఆసుపత్రికి వెళ్దామని అడుగుతున్నారు. అక్కడికి వెళితే అసలు విషయం ఇదీ అని తెలిసిపోతుంది. కానీ ఆ పరిస్థితి లేకుండా నా భార్యతో నేను సెక్స్ చేయడం ఎలాగో తెలుపండి...

 
ఏడాది పాటు సెక్సులో పాల్గొనలేకపోయినప్పుడు దాని గురించి ఇన్నాళ్లు మీరు వేచి చూడటం సమస్యను వదిలేయడమే అవుతుంది. ఇకపోతే అంగ ప్రవేశం దుర్లభం కావడం వెనుక ఎన్నో కారణాలు ఉంటాయని అనుకున్నప్పటికీ ముఖ్యంగా యోనిలో కన్నెపొర మరీ దళసరిగా ఉండటం మూలాన ఈ సమస్య తలెత్తిందని చెప్పవచ్చు. దీనిని అధిగమించి సెక్సు సుళువయ్యేందుకు గైనకాలజిస్టును సంప్రదించక తప్పదు. 
 
కన్నెపొర దళసరిగా ఉండి అంగ ప్రవేశం దుర్లభం అవుతున్న పక్షంలో హైమనోటమీ అనే పద్ధతి ద్వారా యోని వద్ద మత్తు మందు ఇచ్చి ఆ పొరను చిన్నచిన్న గాట్లు పెట్టి మార్గాన్ని సెక్సులో పాల్గొనేందుకు అనువుగా మారుస్తారు. ఈ పద్ధతి ఇబ్బందికరంగా ఏమీ ఉండదు. సుమారు 15 రోజులపాటు చికిత్స తర్వాత విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. గాయం తగ్గుతుంది. కనుక వైద్యుని సంప్రదించి తగు చికిత్స తీసుకోవడం మంచిది.