గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: మంగళవారం, 24 ఫిబ్రవరి 2015 (14:53 IST)

భర్త లేరు కదా... సెక్స్ సుఖం కావాలనిపించట్లేదా అనడిగాను...

నేను ఉద్యోగం చేస్తున్నాను. నా వయసు 27 సంవత్సరాలు. మా ఆఫీసులో 36 ఏళ్ల ఆంటీ ఉంది. ఆమె భర్త ప్రమాదంలో పోయారట. ఆమె తన ఏడేళ్ల కుమార్తెతో ఉంటున్నట్లు చెప్పింది. ఆఫీసులో నాతో చాలా క్లోజ్ గా మాట్లాడుతుంటుంది. ఐతే ఇటీవల ఎందుకో నాతో మాట్లాడటం మానేసింది. చాట్ చేయడానికి కూడా ఇష్టపడటంలేదు. 
 
నేను ఈమధ్య ఆమె గురించి కొన్ని ప్రశ్నలు వేశాను. భర్త లేరు కదా... సెక్స్ సుఖం కావాలనిపించట్లేదా... అని చనువుకొద్దీ అడిగేశాను. నా ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పలేదు కానీ అప్పట్నుంచి ఆమె నాతో మాట్లాడటం తగ్గించేసింది. నా ఉద్దేశ్యం... ఆమె ఒప్పుకుంటే ఆమెను పెళ్లి చేసుకుని దాంపత్య సుఖాన్ని అందించాలని... నా ఆలోచన తప్పా...?
 
ఆమె మీతో మాట్లాడటం ఆపేసిందన్నప్పుడే మీకీ విషయం తెలిసి ఉండాలి. భర్త లేకపోయినా ఆమె స్వశక్తితో తన కాళ్లపై తను బ్రతుకుతున్నది. ఆమె సన్నిహితంగా మాట్లాడినంత మాత్రాన సెక్స్ గురించిన ప్రశ్నలు వేసి ఆమెను నొప్పించారు. మీ ఉద్దేశ్యం ఆమెను పెళ్లాడాలనుకుంటే... ఆ విషయాన్ని ఆమెకు చెప్పేయాల్సింది. ఆమె మిమ్మల్ని మరిచిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది కనుక మీరు కూడా అవన్నీ వదిలేసి ఉద్యోగంలో పైకెదిగేందుకు ప్రయత్నం చేయండి.