బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 26 ఫిబ్రవరి 2015 (17:24 IST)

బావతో సెక్సులో పాల్గొని బిడ్డను కని ఇస్తానంటోంది...

నా భర్త చాలా మంచివాడు. మా పెళ్లయి రెండేళ్లు దాటింది. ఐతే ఇప్పటివరకూ పిల్లల్లేరు. పరీక్ష చేయిస్తే లోపం నాలోనే ఉందన్నారు. నాకు సంతానం కలిగే అవకాశం లేదని తేలిపోయింది. దీంతో పిల్లలను దత్తత తెచ్చుకుందామంటే నాకిష్టం లేదు. ఆయన పిల్లల విషయం పట్టించుకోవడంలేదు. లేకపోతే ఏమిటి... మనం సంపాదించేది లేనివాళ్లకు దానం చేద్దాం అంటున్నారు. 
 
ఐనప్పటికీ నాకు పిల్లలు కావాలనిపిస్తోంది. అందుకని కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా మా ఆయన వీర్యంతో బిడ్డను కని ఇమ్మని మా చెల్లిని అడిగాను. మా చెల్లెలి భర్త ప్రమాదంలో తీవ్రగాయాలై కుర్చీకే పరిమితమయ్యారు. ఆయన సంసారానికి పనికిరారని చెప్పారు. 
 
అందువల్ల నా విన్నపాన్ని మా ఆయనకు కూడా చెప్పాను. ఆయన అతికష్టం మీద ఒప్పుకున్నారు. ఐతే నా చెల్లెలు వచ్చి... తనకు భర్తతో సెక్స్ సుఖం లేదనీ, అందువల్ల బావగారితో నేరుగానే సెక్స్ సుఖాన్ని అందుకుని బిడ్డను కని ఇస్తానని అంటోంది. బిడ్డను కన్న తర్వాత బావగారితో సంబంధం వదిలేస్తా అంటోంది. కానీ ఇది నాకు నచ్చలేదు. మా చెల్లెలు ఆలోచన కరెక్టా...?

 
పిల్లలు లేరన్న బాధ మీ భర్తకు లేనపుడు మీకెందుకు సమస్య. లేనిపోని కష్టాలు కొనితెచ్చుకోవడం ఎందుకు. బిడ్డను కన్న తర్వాత ఏం జరుగుతుందో తెలియకుండా మీ వారికి, మీ చెల్లికి సంబంధం కలపడం ఎందుకు. మీ చెల్లి ప్రతిపాదన వల్ల మీ రెండు కుటుంబాలు ఇబ్బందుల్లో పడతాయి. మీ చెల్లెలు ప్రతిపాదన, మీ ప్రతిపాదన సంగతి మీ చెల్లి భర్తకు తెలుసా... కాబట్టి ఇలాంటివి భవిష్యత్తులో ఇద్దరి కుటుంబాలను సమస్యల సుడిగుండంలో పడవేస్తాయి. ఆ ఆలోచనలను మానుకోండి.