శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 2 మార్చి 2015 (17:32 IST)

స్ఖలించిన వెంటనే మళ్లీ కావాలంటోంది... నిమిషాల్లోనే పాల్గొనేందుకు మందులున్నాయా...?

సెక్సులో వీర్య స్ఖలనం ముగిసిన వెంటనే మళ్లీ వెంటనే కావాలని నా భార్య గోల చేస్తోంది. నేను తిరిగి వెనువెంటనే చేయలేకపోతున్నాను. వీర్య స్ఖలనమైన కొద్ది నిమిషాల్లోనే అంగం గట్టిపడి తిరిగి సెక్సులో పాల్గొనేందుకు ఏమైనా మందులున్నాయా...? 

 
సెక్సులో రెండు వరుస స్ఖలనాల మధ్య ఉండే కాలాన్ని రిఫ్రాక్టరీ పీరియడ్ అంటారు. వయసులో ఉన్నప్పుడు వీర్యాన్ని స్ఖలించిన వెంటనే మళ్లీ తిరిగి వెంటనే సెక్స్ చేయగలుగుతారు. కానీ వయసు పైబడే కొద్దీ ఈ సామర్థ్య తగ్గుతుంది. యుక్త వయసులో ఉన్నప్పుడు కూడా రెండు, మూడుసార్లు చేసేటపుడు సమయం పడుతుంది. 
 
ఐతే వయసు పైబడి సెక్స్ సామర్థ్యం తగ్గుతుందని అనిపిస్తే చాలామంది వయగ్రా వంటి మందులు గురించి ఆలోచన చేస్తుంటారు. ఐతే మందులతో పనిలేకుండా సహజమార్గాల ద్వారా వెంటనే సెక్సులో పాల్గొనే అవకాశం ఉంది. స్ఖలించిన తర్వాత పురుషాంగం, వృషణాల పైన వేడి వస్త్రంతో నెమ్మదిగా మర్దన చేస్తే తిరిగి అంగం స్తంభిస్తుంది. ఐతే స్త్రీని భావప్రాప్తికి చేర్చేందుకు వెంటనే సెక్స్ చేయాల్సిన అవసరం లేదు.