గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Updated : మంగళవారం, 3 మార్చి 2015 (17:09 IST)

అందమైన అమ్మాయి నన్ను ఇష్టపడుతోంది... కానీ అంగం స్తంభించడంలేదు...

నేను కాలేజీ చదువు పూర్తి చేసి పీజీ చేస్తున్నాను. అక్కడ నాకు అందమైన అమ్మాయి పరిచయమైంది. మా పరిచయం ప్రేమగా మారింది. ఈమధ్య ఆమె నాకు చాలా సన్నిహితమైంది. పెళ్లి ప్రపోజల్ చేసుకున్నాం. ఓ రోజు ఆమె నాకు దగ్గరగా వచ్చింది. కౌగిళ్లు, ముద్దులు అన్నీ అయ్యాయి. కానీ అంత సమీపంలోకి ఆమె వచ్చినా నా అంగం మాత్రం స్తంభించలేదు. కొద్దిసేపటికి చమట్లు పట్టేశాయి. నేను నాలుగేళ్లుగా రోజుకు నాలుగుసార్లు హస్తప్రయోగం చేసుకుంటున్నాను. అందువల్ల ఆమె వద్ద నా అంగం స్తంభించకుండా పోయిందా...?

 
హస్త ప్రయోగం అధికం, తక్కువ అనేది ఏమీ లేదు. సెక్స్ కోర్కెలు కలిగినప్పుడు దానిని అదుపులో ఉంచేందుకు యువతీయువకులు పాటించే పద్ధతి అదొకటి. కాబట్టి మీ విషయంలో హస్త ప్రయోగం వల్ల అంగం స్తంభించకుండా పోయిందనుకోవడం అపోహ. ముఖ్యంగా ఆమెకు సన్నిహితంగా చేరువైనప్పుడు మీలో చోటుచేసుకున్న భయం, ఆందోళన కారణంగా అంగం స్తంభించకుండా పోయింది. అలాగే చమట్లు పోసి నీరుగారి పోవడానికి కూడా అదే కారణం.