బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 5 మార్చి 2015 (21:02 IST)

నాతో సెక్స్ చేస్తూ వీడియో రికార్డ్ చేశాడు... అడిగితే జస్ట్ ఫర్ ఫన్ అంటున్నాడు...

నా భర్తలో విపరీత చేష్ట ఇటీవల బయటపడింది. మేమిద్దరమూ ఇప్పుడు 40ల వయసుకు దగ్గర్లో ఉన్నాము. నాతో సెక్స్ చేస్తున్నప్పుడు ఆయన తన ఐ ఫోనులో రికార్డ్ చేస్తున్నాడు. సెక్స్ ముగిశాక వాటిని నాకు చూపించి దానిపై కామెంట్స్ చేస్తుంటాడు. ఐతే వాటిని ఆ తర్వాత తొలగించడు. అలాగే ఉంచేస్తున్నాడు. వాటిని ఫోను నుంచి తీసేయమని చెప్పినా వినడం లేదు. గట్టిగా అడిగితే... జస్ట్ ఫర్ ఫన్ అంటూ పట్టించుకోవడంలేదు. ఈమధ్య నాతో సెక్స్ చేయడం కంటే ఆ వీడియోలనే చూస్తూ కూర్చుంటున్నారు. నా భయమంతా... పొరబాటున ఆ ఫోనులో ఉన్నవి బయట ప్రపంచానికి తెలిస్తే పరిస్థితి ఏమిటన్నదే. ఆయనకు కోపం రాకుండా ఈ అలవాటును మాన్పించేదెలా...?

 
కొందరి పురుషుల్లో ఇలాంటి విపరీత చేష్టలు ఉంటాయి. తాము సెక్సులో పాల్గొన్న తాలూకు దృశ్యాలను చూసుకుని తృప్తి చెందడం అనేది చేస్తుంటారు. కానీ వాటిని అలా నిక్షిప్తం చేయడం వల్ల వ్యక్తిగత జీవితానికి పెద్ద సమస్య. కాబట్టి సెక్స్ చేస్తున్న సమయంలో అలాంటి రికార్డింగ్ చేయడాన్ని సున్నితంగా తిరస్కరించాలి. మొదట కొద్దిగా కోపంతో ఉన్నప్పటికీ మెల్లగా అర్థం చేసుకుంటారు. అలాగే ఇప్పటికే నిక్షిప్తం చేసి ఉన్న వీడియోలను కూడా ఏదోవిధంగా నచ్చజెప్పి తొలగించండి.